
ప్రేమించే హృదయం ఖాళీగా వుండలేదు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ పరిస్థితి కూడా ఇలానే వుంది. ప్రస్తుతం కత్రినా కైఫ్ ప్రేమయాత్రలు కొనసాగిస్తోంది. ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన తర్వాత సల్మాన్ ఖాన్ కు మనసిచ్చింది కత్రినా. కొంతకాలం ఘాడంగా ప్రేమించుకుందీ జంట. తర్వాత బ్రేక్ అప్ చెప్పుకున్నారు.
సల్మాన్ తో బ్రేప్ అప్ అయిన తర్వాత రన్బీర్ కపూర్ ప్రేమలో మునిగితేలింది కత్రినా. వీరి వ్యవహారం దాదాపు పెళ్లి వరకూ వెళ్ళింది. మరి ఇంతంలో ఏమైందో బాలీవుడ్ కటీఫ్ చెప్పుకుందీ జంట. ఈ బ్రేక్ అఫ్ తర్వాత హీరో ఆదిత్యా రాయ్ కపూర్ కు కత్రినా దగ్గరైయిందని వార్తలు వచ్చాయి.
అయితే ఇప్పుడో షాకింగ్ న్యూస్. వాళ్ళు వీళ్ళు కాదు.. ఏకంగా అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ కొడుకు ఆకాశ్ అంబానీతో కత్రినా డేటింగ్ చేస్తున్నట్లు బాలీవుడ్ హాట్ టాపిక్. ఇటివల బిగ్‌బి అమితాబ్ ఇంట్లో ఓ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి ఆకాశ్‌అంబానీ, కత్రినాలు కలిసి ఒకే కారులో రావడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా నిలిచింది. ఈ పార్టీలో కలసి ఎంజాయ్ చేసిన ఈ జంట పార్టీ తర్వాత ఒకే కారులో తిగురుప్రయాణం అయ్యారట. దీంతో వీరిద్దరి మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అని మాట్లాడుకుంటున్నారు బాలీవుడ్ జనాలు.
No comments:
Post a Comment