Nestham Movie Creations

Tuesday, 8 November 2016

నన్నలా అనుకోవద్దు... కావాలంటే చూపిస్తా: పూజా జవేరి


pooja jhaveriతను గ్లామర్‌ పాత్రలకు వ్యతిరేకి కాననీ.. ఆ అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని పూజా జవేరి చెబుతోంది. తాజాగా ఆమె 'పెళ్లిచూపులు' హీరో విజయ్‌ దేవరకొండతో కలిసి 'ద్వారక' చిత్రంలో నటించింది. ఇందులో అచ్చమైన తెలుగు అమ్మాయిలా డ్రెస్‌తో నటించాను. కథ ప్రకారం.. చాలా బాగుంది అని చెప్పింది. కథ గురించి చెబుతూ... ఓ దొంగ బాబాగా మారితే అదే 'ద్వారక' చిత్రమని తెలిపింది.  గుజరాత్‌కు చెందిన తను ముంబైలో చదువుకున్నానని వెల్లడించింది. ఆ తర్వాత పలు యాడ్స్‌లో పాల్గొన్నాననీ, రిన్‌ సోప్‌ యాడ్‌లో చూసి.. ద్వారాకలో అడిగారని చెప్పుకొచ్చింది. ఇంకా ఆమె మాట్లాడుతూ... గ్రాఫిక్స్‌ డిజైన్‌ కోర్సుతోపాటు కొరియోగ్రాఫర్‌గా పలు కమర్షియల్‌ ప్రోగ్రామ్స్‌కు చేశాను. బాలీవుడ్‌లో ఓ మూవీకి కొరియోగ్రఫీ వైభవ్‌ మర్చంట్‌ దగ్గర పనిచేస్తూ చేశాను. కానీ ఆ సినిమా విడుదలకాలేదు. అందుకే బాలీవుడ్‌ చిత్రాలవైపు మొగ్గు చూపలేదు. తెలుగులో నన్ను బాగా రిసీవ్‌ చేసుకున్నారు. ప్రస్తుతం ధనుష్‌, అధర్వ మురళీ చిత్రాల్లో తమిళంలో నటిస్తున్నాను. డ్రీమ్‌ రోల్స్‌అంటూ పెద్దగా లేవు. కానీ హిస్టారికల్‌, మైథలాజిక్‌ చిత్రాల్లో నటించాలని వుంది' అని చెప్పారు.

No comments:

Post a Comment

About

Flickr