Nestham Movie Creations

Wednesday, 9 November 2016

కమల్‌-గౌతమీ బ్రేకప్‌కు రమ్యకృష్ణ కూడా కారణమా?


దాదాపు 13 ఏళ్లు సహజీవనం తర్వాత కమల్‌హాసన్‌, గౌతమీల బ్రేకప్‌ సంచలనంగా మారింది. ఈ బ్రేకప్‌ గురించి కోలీవుడ్‌ మీడియా రోజుకో వార్త పుట్టిస్తోంది. ఎన్నో కష్టనష్టాల్లో కూడా కలిసి జీవించిన ఆ ఇద్దరూ విడిపోవడానికి కమల్‌ కూతరు శృతీహాసన్‌ కారణమని ఇప్పటివరకు అందరూ అనుకున్నారు. అయితే శృతీహానే కాకుండా రమ్యకృష్ణ కూడా ఈ బ్రేకప్‌నకు కారణమని కోలీవుడ్‌ మీడియా అంటోంది. కమల్‌ తాజాచిత్రం ‘శభాష్‌ నాయుడు’ సినిమాలో శృతీహాసన్‌తో పాటు రమ్యకృష్ణ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేస్తున్న గౌతమి.. ఓ కాస్ట్యూమ్‌ విషయంలో రమ్యకృష్ణతో కూడా గొడవపెట్టుకుందట. గౌతమి డిజైన్‌ చేసిన ఓ కాస్ట్యూమ్‌ను వేసుకోవడానికి రమ్య నిరాకరించడంతోనే ఈ వివాదం మొదలైందట. అయితే ఈ వివాదంలో కమల్‌.. గౌతమిని కాకుండా రమ్యకృష్ణను సపోర్ట్‌ చేశాడట. శృతీతో గొడవలో కూడా కమల్‌ గౌతమిని సపోర్ట్‌ చేయలేదట. వారంతా తన పనితనాన్ని శంకించడాన్ని గౌతమి తట్టుకోలేకపోయిందట. ఈ చిన్న చిన్న గొడవలే కమల్‌, గౌతమి మధ్య విభేదాలకు దారితీశాయట. అందుకే కమల్‌ నుంచి విడిపోవాలని గౌతమి నిర్ణయించుకుందట.

No comments:

Post a Comment

About

Flickr