Nestham Movie Creations

Friday, 11 November 2016

పాలిటిక్స్ కోసమే బ్రేకప్ చెప్పారా..?


పాలిటిక్స్ కోసమే బ్రేకప్ చెప్పారా..?మురుదనాయగన్ కమల్ హాసన్, టాలెంటెడ్ యాక్ట్రెస్ గౌతమి తమ సుదీర్ఘ సహజీవనానికి ముగింపు పలికారు. కమల్ తో విడిపోతున్నట్లు గౌతమి ట్విట్టర్లో ప్రకటించారు. మై లైఫ్ అండ్ డెసిషన్స్ పేరుతో ఫ్యాన్స్ కు లేఖ విడుదల చేసిన గౌతమి. ఈ నిర్ణయం తన ఇష్టపూర్వకంగానే తీసుకున్నానని, ఎవరూ జాలిపడొద్దని చెప్పడం చర్చనీయాంశమైంది. సినిమాల్లోకి రాకముందు నుంచే కమల్ వీరాభిమానినని చెప్పుకున్న గౌతమి.. బాథాకరమైన తప్పనిసరి పరిస్థితుల్లో నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ముఖ్యంగా భవిష్యత్తు కోసం విడిపోక తప్పలేదన్న గౌతమి మాటల్లో ఆంతర్యం ఎవరికీ అర్థం కావడం లేదు. శభాష్ నాయుడు మూవీ షూటింగ్ సమయంలో గౌతమి, శృతి మధ్య కాస్ట్యూమ్స్ గొడవే ఈ మొత్తం ఎపిసోడ్ కు కారణమనే చర్చ జరుగుతోంది. ఆ సమయంలో కమల్ శృతి వైపే నిలబడ్డారని, అందుకే గౌతమి బాథపడ్డారని తెలుస్తోంది. కొన్ని నెలలుగా కమల్ కు దూరంగా ఉంటున్న గౌతమి.. ఇప్పుడు అధికారికంగా బ్రేకప్ సంగతి చెప్పారు. కానీ అసలు విషయం వేరే ఉందని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. పాలిటిక్స్ పై ఇంట్రస్ట్ చూపిస్తున్న గౌతమి ఈ మధ్యే మోడీ, వెంకయ్యను కలిశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలున్నాయనుకుంటున్నారు. తన పాలిటిక్స్ కమల్ మూవీస్ కు దెబ్బ కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. గౌతమి చెప్పిన భవిష్యత్ పాలిటిక్సేననే వాదన బలంగా వినిపిస్తోంది

No comments:

Post a Comment

About

Flickr