
తన కూతురి పెళ్లి ఇన్విటేషన్లను పంచడం కోసం గాలి జనార్దనరెడ్డి టాలీవుడ్ సెలబ్రెటీలను పిలిచి హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్లో గ్రాండ్ కాక్ టైల్ పార్టీ ఇవ్వడం ఆసక్తి రేపే విషయమే. టాలీవుడ్ జనాల మీద గాలి అంత ప్రత్యేక శ్రద్ధ పెట్టడానికి కారణం లేకపోలేదు. ఆయన త్వరలోనే సినీ నిర్మాణంలోకి అడుగుపెడుతున్నాడు. అటు కన్నడలో.. ఇటు తెలుగులో సినిమాలు నిర్మించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. తన కూతురి పెళ్లి తర్వాత ప్రకటన చేయొచ్చని సమాచారం. ఈ విషయంలో గాలి నుంచి ప్రకటన రావడానికంటే ముందు మ్యూజిక్ డైరెక్టర్ టర్న్డ్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేశాడు.
తన దర్శకత్వంలో తెరకెక్కిన ‘మనలో ఒకడు’ సినిమాను కన్నడలో పునర్నిర్మించబోతున్నట్లు ఆర్పీ తెలిపాడు. తాను తెలుగులో చేసిన పాత్రను కన్నడలో సాయికుమార్ చేసే అవకాశాలున్నట్లు కూడా ఆర్పీ వెల్లడించాడు. ఈ చిత్రాన్ని గాలి జనార్దనరెడ్డి నిర్మిస్తాడని కూడా ఆర్పీ తెలిపాడు. బహుశా గాలి నిర్మించే తొలి చిత్రం అదే అవుతుందేమో. ఈ చిత్రానికి తనే దర్శకత్వం వహిస్తానా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేనని ఆర్పీ అంటున్నాడు. మరోవైపు ‘మనలో ఒకడు’ సినిమాను తమిళంలో నాజర్ నిర్మించాలనుకుంటున్నట్లు కూడా వార్తలొస్తున్నాయి. ఐతే ఈ సినిమా ఫలితాన్ని బట్టే రీమేక్‌ల సంగతి తేలే అవకాశముంది
No comments:
Post a Comment