
తన దర్శకత్వంలో వస్తున్న కొత్త సినిమా 'మనలో ఒకడు' చూశాక మీడియా సంస్థల్ని నడిపే పెద్ద మనుషులందరూ తిట్టిపోస్తారని అంటున్నాడు ఆర్పీ పట్నాయక్. మీడియా గురించి ఇప్పటిదాకా ఎవరూ చూపించని కోణాన్ని తాను 'మనలో ఒకడు'లో చూపిస్తున్నానని.. ఆ అంశంతో ప్రేక్షకులు బాగా కనెక్టవుతారని ఆర్పీ అన్నాడు. ఈ శుక్రవారమే 'మనలో ఒకడు' ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఆర్పీ మాట్లాడాడు.
''మీడియా యజమానుల ఈగోపై ఓ సామాన్యుడు ఎలా పోరాడన్నదే ఈ కథ. నా సినిమా చూశాక మీడియాలో తీవ్ర విమర్శలు రావచ్చు. ఐతే నేను జరిగేదే చూపిస్తున్నాను. మీడియాను వాడుకుని కొందరు యజమానులు ఎలా ప్రవర్తిస్తున్నారో ఇందులో చూపిస్తున్నా. ఈ కథకు కొన్ని నిజ జీవిత ఘటనలే స్ఫూర్తి. వేణుమాధవ్ చనిపోయాడంటూ మీడియాలో పుట్టించిన రూమర్ల గురించి.. ఇంకా మీడియాలో ఇటీవలి కాలంలో వచ్చిన ఫేక్ న్యూస్ గురించి ఇందులో చూపిస్తున్నాం.
సినిమా చూశాక కొందరు తమను ఉద్దేశించే ఈ సినిమా అని ఫీలవ్వచ్చు. విడుదల తర్వాత నాకు కొన్ని సమస్యలు కూడా తలెత్తవచ్చు. వాటన్నింటికీ సిద్ధంగా ఉన్నాను. ఇందులో కేవలం సమస్యను చూపించి వదిలేయట్లేదు. పరిష్కారం కూడా చూపిస్తున్నాం. నేను కథను నరేట్ చేసిన విధానం ప్రతి జర్నలిస్టుకూ నచ్చుతుందని అనుకుంటున్నా'' అని ఆర్పీ తెలిపాడు
No comments:
Post a Comment