Nestham Movie Creations

Friday, 11 November 2016

రాశి ఖన్నా.. కెరీర్లో బిగ్గెస్ట్ ఆఫర్


రాశి ఖన్నా.. కెరీర్లో బిగ్గెస్ట్ ఆఫర్ఊహలు గుసగుసలాడే’లో ట్రెడిషనల్ హీరోయిన్ లాగా పరిచయమైన రాశి ఖన్నాను చూసి.. కమర్షియల్ సినిమాలకు పనికి రాదు అనుకున్నారు. కానీ ‘జోరు’ సినిమాలో తనలోని మరో కోణాన్ని చూపించి.. మాస్ సినిమాల్లోనూ అవకాశాలందుకుంది రాశి. ఐతే గత రెండేళ్లలో చాలా సినిమాలు చేసింది కానీ.. ఒక స్థాయికి మించి మాత్రం ఎదగలేకపోయింది. దాదాపుగా తనతో పాటే ఇండస్ట్రీలోకి వచ్చిన రకుల్ ప్రీత్ పెద్ద పెద్ద ఛాన్సులతో దూసుకెళ్లిపోతుంటే.. రాశి టాప్ లీగ్ కు దూరంగా ఉండిపోయింది. ఐతే ఈ ఏడాది రాశి చేసిన సినిమాలన్నీ ఆడేస్తుండటం.. గ్లామర్ డోస్ పెంచడం.. ఈ మధ్య కొంచెం బరువు కూడా తగ్గడంతో రాశి మీద దర్శక నిర్మాతల అభిప్రాయం మారుతున్నట్లుంది. కెరీర్లో బిగ్గెస్ట్ ఆఫర్ దిశగా రాశి అడుగులేస్తున్నట్లు సమాచారం. ఆమె తొలిసారిగా ఓ పెద్ద స్టార్ తో సినిమా చేయబోతోందట. ఆ హీరో మరెవరో కాదు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. సుకుమార్ దర్శకత్వంలో చరణ్ చేయబోయే సినిమాకు రాశిని పరిశీలిస్తున్నారు. ఆమెకు ఆల్రెడీ ఆడిషన్ కూడా జరిగింది. సుక్కు ఆమె పట్ల సానుకూలంగానే ఉన్నట్లు సమాచారం. ఈ ఛాన్స్ దక్కితే రాశి కెరీర్ మలుపు తిరిగినట్లే. సుక్కు సినిమాలో హీరోయిన్లకు మంచి రోల్స్ ఉంటాయి. బాగా చేస్తే మంచి పేరొస్తుంది. చరణ్ తో చేసి మెప్పిస్తే.. ఇక మిగతా స్టార్ హీరోల పక్కన కూడా ఆటోమేటిగ్గా ఛాన్సులొచ్చేస్తాయి. మరి ఈ అవకాశాన్ని రాశి ఒడిసిపట్టుకుంటుందో లేదో చూడాలి.

No comments:

Post a Comment

About

Flickr