Nestham Movie Creations

Friday, 11 November 2016

పాపం రష్మి సరదా తీర్చేసిందట


పాపం రష్మి సరదా తీర్చేసిందటగుంటూర్‌ టాకీస్‌తో వచ్చిన గుర్తింపుని క్యాష్‌ చేసేసుకోవడానికి వెనకా ముందు చూడకుండా సినిమాలు ఒప్పేసుకున్న జబర్దస్త్‌ బ్యూటీ రష్మి గౌతమ్‌కి మళ్లీ అలాంటి సినిమానే రాలేదు. కనీసం తన చిత్రాలని జనం పట్టించుకోను కూడా పట్టించుకోవడం లేదు. అయితే సినిమా రంగంలో ఎలాగైనా నిలదొక్కుకోవాలని, వచ్చిన ఊపుని వాడేసుకోవాలని రష్మి చాలా ట్రై చేస్తోంది. తన సినిమాలు ఆర్థిక ఇబ్బందుల్లో పడితే సొంత డబ్బులు సైతం వదిలించుకోవడానికి ఆమె వెనకాడ్డం లేదు. తను వచ్చెనంట చిత్రం అలాగే రిలీజ్‌కి తంటాలు పడుతోంటే రష్మి తన భుజాల మీదకి తీసుకుని ఎదురు డబ్బులు పెట్టి రిలీజ్‌ అయ్యేలా చూసుకుందట. ఖచ్చితంగా ఈ జాంబీ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తుందని రష్మి భావించింది. కానీ ఈ సినిమాని పట్టించుకునే వాళ్లే లేకపోవడంతో కనీసం పోస్టర్‌ ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ సినిమాకి తీసుకున్న పారితోషికంతో పాటు సొంత డబ్బు కూడా పెట్టిన రష్మికి ఇప్పుడు వాటిలో పైసా తిరిగివచ్చే సూచనలే లేవు. కనీసం శాటిలైట్‌ రైట్స్‌ అమ్ముకుందామన్నా ఇంత ఘోరమైన పరాజయం పాలైన సినిమాని ఎవరు మాత్రం కొంటారు? కేవలం నటనకే పరిమితమై, మిగతాది నిర్మాతల తిప్పలకే వదిలేసినట్టయితే కనీసం ఫ్లాప్‌తో పోయేది. ఇప్పుడు ఉన్నదీ పోయి, వచ్చిందీ పోయి పాపం సరదా బాగానే తీరిపోయింది.

No comments:

Post a Comment

About

Flickr