తెలుగులో అసలే సీక్వెల్స్ బాగా ఆడిన చరిత్ర లేదు. దీనికి తోడు ‘బాహుబలి’ లాంటి బ్లాక్‌బస్టర్ మూవీకి కొనసాగింపుగా సినిమా అంటే ఎంత ప్రెజర్ ఉంటుందో అంచనా వేయొచ్చు. కానీ రాజమౌళి మాత్రం ‘బాహుబలి: ది కంక్లూజన్’ విషయంలో టెన్షనే పడలేదంటున్నాడు. ఈ సినిమా విషయంలో ఎగ్జైట్ అవుతున్నా తప్ప టెన్షన్ పడట్లేదన్నాడు. ‘బాహుబలి: ది బిగినింగ్’తో పోలిస్తే ‘బాహుబలి: ది బిగినింగ్’కే కష్టం ఎక్కువని.. కానీ తొలి భాగానికే తామందరం ఎక్కువ టెన్షన్ పడ్డామని చెప్పాడు. దీనికి కారణం వివరిస్తూ.. ‘‘బాహుబలి: ది బిగినింగ్ చేస్తున్నపుడు చాలా భయాలుండేవి. ఈ ప్రయత్నం ఎలాంటి ఫలితాన్నిస్తుందో.. జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో.. ఇంత పెట్టుబడి పెడుతున్నాం ఏమవుతుందో అని భయపడే వాళ్లం. ఐతే ప్రేక్షకుల రెస్పాన్స్ చూశాక చాలా సంతోషం వేసింది. రెండో పార్ట్ విషయంలో మరింత ఎగ్జైట్మెంట్తో పని చేశాం. నిజానికి ‘ది బిగినింగ్’తో పోలిస్తే.. ‘ది కంక్లూజన్’లో కష్టం ఎక్కువుంది. భారీతనం ఉంది. అయినా ఇప్పుడు రిలాక్స్డ్గా ఉన్నాం. పైగా నటీనటులు.. టెక్నీషియన్లు అందరితోనూ బాగా అలవాటైపోయింది. అందరూ కాన్ఫిడెన్స్‌తో పని చేస్తున్నారు’’ అని రాజమౌళి తెలిపాడు. ఇక బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ప్రశ్న ఇంత పాపులర్ అవుతుందని.. దాని కోసం జనాలు ఇంత ఆతృతతో ఎదురు చూస్తారని.. తాను ఊహించలేదని రాజమౌళి చెప్పాడు. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లే బాహుబలి-2 సిద్ధమవుతోందని.. ప్రేక్షకుల్ని మరోసారి మెప్పిస్తామని ఆత్మవిశ్వాసంతో ఉన్నామని రాజమౌళి ధీమా వ్యక్తం చేశాడు

No comments:
Post a Comment