ఆలూ లేదు చూలూ లేదు అన్నట్లుగా ఉంది పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా పరిస్థితి. అసలీ సినిమా ఎప్పుడు మొదలవుతుందో తెలియట్లేదు కానీ.. ఈ సినిమా గురించి రోజుకో రూమర్ అయితే వినిపిస్తోంది. ఈ సినిమా గురించి రెండు రోజులుగా వినిపించిన తాజా రూమర్ ఏంటంటే.. సమంత ఇందులో కథానాయికగా నటిస్తోందట. తన లక్కీ ఛార్మ్ ను త్రివిక్రమ్ వదలట్లేదని.. సమంతతోనే వరుసగా నాలుగో సినిమా చేసేస్తున్నాడని ‘అత్తారింటికి దారేది’ కాంబో రిపీట్ అని మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. వెబ్ సైట్లతో పాటు పత్రికల్లోనూ ఈ వార్త విస్త్రతంగా కనిపించింది. ఐతే ఈ రూమర్లకు సమంత చెక్ పెట్టింది. ట్విట్టర్లో అభిమానులతో చిట్ చాట్ సందర్భంగా.. తాను ఈ సినిమా చేయట్లేదని.. ఈ వార్త అబద్ధం అని స్పష్టం చేసింది సమంత. మరోవైపు పవన్-త్రివిక్రమ్ సినిమాను ప్రొడ్యూస్ చేయాల్సి ఉన్న నిర్మాత రాధాకృష్ణ సైతం తమ సినిమా గురించి వస్తున్న రూమర్లను కొట్టిపారేశాడు. ఈ సినిమా టైటిల్.. హీరోయిన్ విషయంలో వస్తున్న వార్తలు అబద్ధం అని చెప్పాడు. నవంబరు 5న ఈ చిత్రం ప్రారంభోత్సవం జరగొచ్చని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. బహుశా ఆ రోజే పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడించే అవకాశముంది. నవంబర్లో ఈ సినిమా షూటింగ్ కోసం పవన్ 15 రోజులు డేట్లు కూడా ఇచ్చాడంటున్నారు. ‘కాటమరాయుడు’తో సమాంతరంగా షూటింగ్ చేస్తూ వచ్చే ఏడాది మధ్యలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలన్నది ప్లాన్

No comments:
Post a Comment