Nestham Movie Creations

Friday, 11 November 2016

వర్మ ఆయన్నీ వదిలేట్లు లేడుగా.


వర్మ ఆయన్నీ వదిలేట్లు లేడుగా..నిజ జీవిత కథాంశాలతో.. పాత్రలతో సినిమాలు చేయడం వర్మకు అలవాటు. ఈ క్రమంలో ఎన్ని వివాదాలు ఎదురైనా ఆయన పట్టించుకోడు. 'రక్తచరిత్ర' టైంలో ఆ కథాంశం గురించి, అందులోని పాత్రల గురించి ఎన్ని వివాదాలు చెలరేగాయో తెలిసిందే. అయినా వర్మ వెనక్కి తగ్గలేదు. ఆ తర్వాత కూడా ఇలాంటి సినిమాలే ట్రై చేస్తున్నాడు. డిసెంబర్లో రాబోతున్న 'వంగవీటి' కూడా వివాదాస్పద సినిమానే. అందులోని పాత్రలపై వివాదాలు చెలరేగడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు వర్మ కొత్త సినిమా 'సర్కార్-3'లోనూ కొన్ని నిజ జీవిత క్యారెక్టర్లు దర్శనివ్వబోతున్నాయి. బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టి లండన్లో సెటిలైన విజయ్ మాల్యాను పోలిన 'మైకేల్ వాల్యా' అనే క్యారెక్టర్ 'సర్కార్-3'లో ఉన్న సంగతి ఇప్పటికే వెల్లడైంది. తాజాగా మరో నిజ జీవిత పాత్రకూ ఇందులో చోటుందని తెలిసింది. ఆ పాత్రకు స్ఫూర్తి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కావడం విశేషం. ఈ పాత్రను మనోజ్ బాజ్పేయి చేస్తున్నాడు. ఆ క్యారెక్టర్ పేరు.. గోవింద్ దేశ్ పాండే. ఆల్రెడీ ఈ క్యారెక్టర్లో మనోజ్ లుక్ కూడా బయటికి వచ్చింది. కేజ్రీవాల్ తరహలోనే మెడకు మఫ్లర్ చుట్టుకుని కనిపిస్తున్నాడు మనోజ్ ఇందులో. ఐతే కేజ్రీవాల్ పాత్రను వర్మ ఎలా చూపిస్తాడన్నది ఆసక్తికరం. ఇటీవలే ఇండియన్ ఆర్మీ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన కేజ్రీవాల్పై వర్మ విమర్శలు గుప్పించాడు. ఆయన ఒక కోతి అన్నాడు. హిందు-ముస్లింకు పుట్టిన క్రాస్ బ్రీడ్ కేజ్రీవాల్ అన్న తరహాలో మాట్లాడాడు. ఈ నేపథ్యంలో గోవింద్ దేశ్ పాండే పాత్రను నెగెటివ్గానే చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి

No comments:

Post a Comment

About

Flickr