Nestham Movie Creations

Friday, 11 November 2016

అన్యాయమండీ బాబూ!


అన్యాయమండీ బాబూ!బాలీవుడ్ విజయవంతమైన యువ హీరోయిన్ గా శ్రద్ధ కపూర్ మంచి పేరే తెచ్చుకుంది. సూపర్ హిట్స్ తో కెరియర్ ను సక్సెస్ ట్రాక్ లోనే నడిపించుకుంటోంది. కానీ అమ్మడిని కొన్ని విషయాలు తెగ ఇబ్బంది పెట్టేస్తున్నాయట. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు.. ప్రధానంగా అఫైర్లపై వస్తున్న న్యూస్ వల్ల పనిపై దృష్టి పెట్టలేకపోతున్నానని వాపోతోంది. తన గురించి చాలా అన్యాయంగా రాసేస్తున్నారని ఫీలైపోతోంది. ''సంబంధాలు అంటగట్టే వ్యవహారం నన్ను నిజంగా ఇబ్బంది పెడుతోంది. నేను పనిచేస్తున్న తోటి నటులతోనే అఫైర్లు అంటగడుతూ వార్తలు రాయడం చాలా అన్యాయం" అని చెప్పుకొచ్చింది. 'రాక్ ఆన్-2'లో లీడ్ రోల్స్ పోషించిన శ్రద్ధ-ఫర్హాన్ ల మధ్య వ్యవహారం నడుస్తోందంటూ చాలాకాలంగా వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే శ్రద్ధ ఇలా రెస్పాండ్ అయింది. ''నా పట్ల చాలా అన్యాయంగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా {రాక్ ఆన్-2} కోసం 66రోజులు పనిచేశా. మరో 70రోజులు ప్రిపరేషన్ కు కేటాయించా. వ్యక్తిగత వ్యవహారాలు ప్రస్తావిస్తుండడం వల్ల ఈ కష్టమంతా నిరుపయోగంగా మారిపోయినట్టుగా తోస్తోంది" అని అఫైర్లపై ప్రశ్నిస్తున్నవారిపై అసంతృప్తి వెళ్లగక్కుతోంది 'బాఘీ" బ్యూటీ. ''ఇంటర్వ్యూ అనేది సినిమాల గురించే బాగా తెలుసుకునే వేదికగా ఉండాలన్నది నా భావన. ఓ సినిమా ఎలా తయారవుతుందో జనాలు తెలుసుకోవాలనే భావిస్తున్నా. అంతే కానీ ముఖాముఖి చర్చ అంటే ప్రేమ వ్యవహారాలు, రొమాంటిక్ రిలేషన్ల గురించి మాట్లాడుకునే వ్యవహారం కాకూడదు"" అని గట్టిగానే బదులిచ్చింది శ్రద్ధ

No comments:

Post a Comment

About

Flickr