
స్టార్..స్టార్..
సచిన్ టెండూల్కర్, అమితాబ్ బచ్చన్, అక్కినేని నాగార్జున, మమ్ముట్టి, ప్రభు, జయరామ్ ఎవరికి వారే తమ ఫీల్డ్ లో లెజండ్స్. సచిన్ క్రికెట్ ప్రపంచపు దేవుడైతే మిగిలిన వారు వెండితెర వేల్పులు. వీరంతా ఒక్కచోట కలిస్తే? ఒకే ఫ్రేమ్ లో చిక్కితే? కనుల పండగే. ఈ పండగ లాంటి చిత్రాన్నే బిగ్ బీ తాజాగా ట్విట్టర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు. ''ఒకే పైకప్పు కింద ప్రతిభావంతులతో నిలబడడం ప్రత్యేకంగానే కాక గౌరవంగానూ ఉంది" అని వ్యాఖ్యానించారు.
కల్యాణ్ జ్యువలర్స్ నిర్వహించిన ఓ కార్యక్రమం సందర్భంగా ఈ లెజండ్స్ అంతా కలుసుకున్నారు. అమితాబ్ షేర్ చేసిన ఈ పిక్చర్ లో సచిన్, ప్రభు మినహా అంతా గడ్డాలు-మీసాలతోనే ఉండడం విశేషం. వీరంతా తమ సినిమాలకు మెయిన్ టైన్ చేస్తున్న ఆహార్యంతోనే ఈ వేడుకలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. సచిన్, అమితాబ్ లాంటి ఉద్ధండులను కలుసుకున్న ఆనందం మన సదరన్ స్టార్స్ లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. బిగ్ బీ పోస్ట్ చేసిన ఈ చిత్రంపై నిమిషాల్లోనే వేలమంది ప్రశంసలు కురిపిస్తూ మెసేజ్ లు పెట్టారు.
No comments:
Post a Comment