Nestham Movie Creations

Friday, 11 November 2016

అలా చేస్తే..వాడి పెదాలు చీరేస్తా!


అలా చేస్తే..వాడి పెదాలు చీరేస్తా!బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఎంత సరదా మనిషో అందరికీ తెలిసిందే. స్నేహితులతోనే కాక అభిమానులతోనూ తరచూ ఫన్నీ కామెంట్స్ చేస్తూ హల్ చల్ చేస్తుంటారు. హాస్యం కలిసిన సెటైరిక్ డైలాగ్స్ తో నవ్వులు పూయిస్తుంటారు. ట్విట్టర్ లో తనపైనే కాక కుటుంబసభ్యులపైనా జోక్స్ పేల్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే, కుమార్తె సుహానా విషయంలో మాత్రం కింగ్ ఖాన్ అందరూ ఆశ్చర్యపోయే స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాడు. తన కుమార్తెను ముద్దాడిన వాడి పెదాలు చీరేస్తా అని ఓ ప్రశ్నకు బదులిచ్చాడు. షారుక్ ఇంతగా రియాక్ట్ అయింది మరెవరితోనే కాదు. క్లోజ్ ఫ్రెండ్ కరణ్ జోహార్ తోనే. 'కాఫీ విత్ కరణ్' షోకు అలియా భట్ తో పాటే హాజరైన 'దిల్ వాలే' స్టార్ కరణ్ అడిగిన పలు ప్రశ్నలకు హాస్యోక్తులు జోడిస్తూ సమాధానాలిచ్చాడు. ఈ క్రమంలో "నీ కుమార్తె సుహానాను ఎవరైనా ముద్దు పెట్టుకునేందుకు యత్నిస్తే ఎలా స్పందిస్తావు?" అని కరణ్ షారుక్ ను క్వశ్చన్ చేశాడు. ఈ ప్రశ్నకు కూడా నవ్వుతూనే "వాడి పెదాలు చీరేస్తా" అంటూ బదులిచ్చాడు షారుక్. ఎంతైనా కుమార్తె కాబట్టి కింగ్ ఖాన్ సమాధానంలో సీరియస్ నెస్ ధ్వనించింది. పిల్లలు చిన్నవాళ్లుగా ఉన్నప్పుడు గతంలో షారుక్ వారి భవిత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సుహానా, ఆమె బోయ్ ఫ్రెండ్ ను కారు వెనక సీట్లో కూర్చోబెట్టి తానే డ్రైవ్ చేయాలనుకుంటున్నానని అన్నాడు. అయితే ఆ సరదా కాస్తా సీరియస్ నెస్ గా మారిపోయిందిప్పుడు. ఆడపిల్లల పట్ల ఏ తల్లితండ్రులైనా కేరింగ్ గానే ఉంటారు. దీనికి బాలీవుడ్ రారాజు కూడా మినహాయింపేమీ కాదన్న సంగతి 'కాఫీ విత్ కరణ్ షో'లో తేలిపోయింది

No comments:

Post a Comment

About

Flickr