
బాలీవుడ్ వెళ్లాక బాగా బోల్డ్ అయిపోయింది ఇలియానా. బికినీలు.. లిప్ లాక్లు.. ఇంటిమేట్ సీన్లు.. హాట్ హాట్ ఫొటోషూట్లు.. ఇలా ఆమె ఏ రేంజిలో రెచ్చిపోయిందో చూస్తూనే వస్తున్నాం. ఐతే తన బోల్డ్నెస్ ఆమె కేవలం అప్పీయరెన్స్ వరకే పరిమితం చేయలేదు. తన మాటల్లో కూడా ఇదే బోల్డ్నెస్ చూపించేస్తోంది. ఇప్పటికే ముంబయి వెళ్లాక అనేక సంచలన వ్యాఖ్యలు చేసింది ఇలియానా. ఇటీవలే తన ఎద సౌందర్యం గురించి కూడా ఓపెన్గా మాట్లాడింది. తనకీ సౌందర్యం తక్కువంటే జనాలు ఎలా కామెంట్లు చేసింది.. తాను ఎలా బాధపడింది.. ఆ తర్వాత ఎలా మానసిక స్థైర్యం పెంచుకున్నది వివరించింది.
తాజాగా తన మరో మైనస్ గురించి కూడా ఇలియానా ఓపెన్గా మాట్లాడేసింది. తన స్కిన్ కలర్ చాలా పూర్ అని ఆమె చెప్పింది. తనను తాను ఫెయిర్ అనుకోనని స్టేట్మెంట్ ఇచ్చింది. తాను వాస్తవానికి నల్లని అమ్మాయినని.. చాలామంది హీరోయిన్లతో పోలిస్తే రంగు తక్కువని ఇలియానా చెప్పింది. ఐతే సినీ పరిశ్రమలో చాలామంది అమ్మాయిలు నల్లగా ఉన్నా.. తమ ఆకర్షణతో ఆకట్టుకున్నారని.. ఆ కోవలోకే తానూ వస్తానని ఇలియానా చెప్పింది. అసలు శరీర రంగు అన్నది పెద్ద విషయం కాదని.. ముఖంలో కళ ముఖ్యమని.. అలాగే ఆత్మసౌందర్యం అన్నది అన్నిటికంటే ప్రధానమైన విషయం అని ఇలియానా సెలవిచ్చింది. ఇల్లీ ఇలా తన మైనస్లు ఒక్కోదాని గురించే ఇలా ఓపెన్ స్టేట్మెంట్లు ఇచ్చేయడం గొప్ప విషయమే
No comments:
Post a Comment