Nestham Movie Creations

Friday, 11 November 2016

తేజ సినిమాలో ఆమె పాత్ర ఏంటంటే


తేజ సినిమాలో ఆమె పాత్ర ఏంటంటే..నటనకు సంబంధించిన విషయాలతో కంటే తరచుగా ఏదో ఒక వివాదంతోనే వార్తల్లో నిలుస్తూ ఉంటుంది కేథరిన్ థ్రెసా. షూటింగ్ సందర్భంగా ఈమె బిహేవియర్ బాగోదంటూ గతంలో కొన్ని కంప్లైంట్లు వచ్చాయి. వివాదాలు చెలరేగాయి. ఐతే గతంలో జరిగిన వివాదాలన్నీ పక్కనబెట్టేస్తే.. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ సందర్భంగానూ మరోసారి తన యాటిట్యూడ్ చూపించడంతో ఆ సినిమా నుంచి ఫైర్ అయిపోయింది. ఆమెను టాలీవుడ్ నుంచి బ్యాన్ చేయాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తుండటం విశేషం. ఐతే మున్ముందు ఆమెకు అవకాశాలు దక్కడం సందేహమే కానీ.. ఆల్రెడీ డాషింగ్ డైరెక్టర్ తేజ.. కేథరిన్‌కు ఓ అవకాశం ఇచ్చాడు. రానా దగ్గుబాటి-కాజల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కేథరిన్ కూడా ఓ కీలక పాత్ర చేస్తోంది. ఈ చిత్రంలో ఆమె పవర్ ఫుల్ పొలిటీషియన్ పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఇలాంటి క్యారెక్టర్ కేథరిన్ ఇప్పటిదాకా చేయలేదట. ఈ పాత్ర గురించి చెప్పగానే ఆమె ఓకే అనేసినట్లు సమాచారం. కేథరిన్ ఆల్రెడీ ‘సరైనోడు’ సినిమాలో అందమైన ఎమ్మెల్యే పాత్రలో కనిపించింది. ఆ సినిమాకు ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఐతే తేజ పాత్ర ఇలా రొమాంటిగ్గా ఉండే అవకాశం లేదు. పవర్ ఫుల్ ఎమ్మెల్యే అంటున్నారు కాబట్టి.. వైవిధ్యంగానే ఉంటుంది. ఆమెది నెగెటివ్ క్యారెక్టర్ కూడా అయి ఉండొచ్చు. ఐతే పాత్ర సంగతి పక్కనబెడితే.. కేథరిన్ అందరి దగ్గరా యాటిట్యూడ్ చూపించినట్లు తేజ దగ్గర చూపిస్తే మాత్రం కష్టం. ఆయనతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మరి.

No comments:

Post a Comment

About

Flickr