Nestham Movie Creations

Friday, 11 November 2016

ఇక‌పై అలా చేయ‌ను.. సినిమా రిలీజ్ చేయండి ప్లీజ్‌


ఇక‌పై అలా చేయ‌ను.. సినిమా రిలీజ్ చేయండి ప్లీజ్‌పాకిస్థాన్ ఆర్టిస్టుల్ని సినిమాల్లో పెట్టుకుంటే త‌ప్పేంటి.. ఇక‌ముందూ వాళ్ల‌తో సినిమాలు చేస్తానంటూ కొన్ని రోజుల కింద‌ట గంభీర‌మైన ప్ర‌క‌ట‌న‌లిచ్చాడు బాలీవుడ్ డైరెక్ట‌ర్ క‌మ్ ప్రొడ్యూస‌ర్ క‌ర‌ణ్ జోహార్. ఐతే అత‌డి కొత్త సినిమా ‘ఏ దిల్ హై ముష్కిల్‌’కు అనుకోకుండా పెద్ద అవాంతంరం వ‌చ్చిప‌డింది. ఆ సినిమాలో పాక్ న‌టుడు ఫ‌వాద్ ఖాన్ ఉన్న నేప‌థ్యంలో ఈ సినిమాను ప్ర‌ద‌ర్శించ‌బోమంటూ నాలుగు రాష్ట్రాల‌కు చెందిన ఎగ్జిబిట‌ర్లు తీర్మానం చేయ‌డం ఎటూ పాలుపోని స్థితికి వ‌చ్చాడు క‌ర‌ణ్‌. సినిమా విడుద‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో క‌ర‌ణ్ దిగి రాక త‌ప్ప‌లేదు. ఇక‌పై పాకిస్థాన్ న‌టుల్ని త‌న సినిమాల‌కు తీసుకోనని స్టేట్మెంట్ ఇవ్వ‌డ‌మే కాదు.. త‌న దేశ‌భ‌క్తి ఎంతో చెబుతూ ఒక వీడియో సందేశాన్ని సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు క‌ర‌ణ్‌. కొంతమంది తనను జాతి వ్యతిరేకిగా ముద్రవేయడంతో చాలా బాధపడ్డానని, అందుకే ఇన్నాళ్లూ బయటకు రాలేదని క‌ర‌ణ్ చెప్పాడు. ఉగ్రవాదాన్ని తాను గట్టిగా ఖండిస్తానని, మన సైన్యాన్ని గౌరవిస్తానని.. తనకు దేశమే ముఖ్యమని అన్నాడు. దేశభక్తిని ప్రదర్శించడానికి ఉత్తమ మార్గం ప్రేమను పంచడమేనని.. అది తాను తన సినిమాల ద్వారా చేస్తున్నానని అన్నాడు. తాను ‘ఏ దిల్ హై ముష్కిల్’ సినిమా తీసేటప్పటికి ఇరు దేశాల సంబంధాలు బాగానే ఉండేవని.. ప్రభుత్వం కూడా అప్ప‌ట్లో పాకిస్థాన్ తో స్నేహ సంబంధాల కోసమే ప్రయత్నించిందని తెలిపాడు. కానీ ఇప్పుడు సెంటిమెంట్లు వేరుగా ఉన్నాయని.. వాటిని తాను గౌరవిస్తానని అన్నాడు. ఇక పై తాను పాకిస్థానీ నటీనటులతో సినిమాలు చేయబోనని.. ఐతే ఇప్పుడు చేసిన సినిమాలో దాదాపు 300 మందికి పైగా భారతీయులు కూడా పనిచేశారని చెప్పాడు. వాళ్లంతా తమ రక్తం.. చెమట ధారపోశారని.. వాళ్లంతా ఇబ్బంది ప‌డ‌తారు కాబ‌ట్టి ఈ సినిమాను అడ్డుకోవ‌డం స‌రికాద‌ని క‌ర‌ణ్ అన్నాడు. మ‌రి అత‌డి విజ్న‌ప్తిని మ‌న్నించి ఎగ్జిబిట‌ర్లు దిగొస్తారేమో చూడాల

No comments:

Post a Comment

About

Flickr