Nestham Movie Creations

Friday, 11 November 2016

ఐష్ మాదిరే రానాతో సమంత కెమిస్ట్రీ


ఐష్ మాదిరే రానాతో సమంత కెమిస్ట్రీపెళ్లి అయి.. ఓ పిల్లకు తల్లి అయిన ఐశ్వర్యారాయ్ బచ్చన్ ‘యే దిల్ హై ముష్కిల్’ చిత్రంలో స్క్రీన్ మీద ఎంతగా చెలరేగిపోయిందో తెలిసిందే. ఐష్ రొమాన్స్ ధాటికి ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ సినిమాలో తనకంటే పదేళ్లు చిన్నోడైన రణబీర్ కపూర్ తో ఆమె పండించిన హాట్ హాట్ రొమాన్స్.. కుర్ర హీరోయిన్లకు సైతం షాకిచ్చేలా ఉందన్న కామెంట్లు ఉన్నాయి. బాలీవుడ్ లో ఐష్ ఎలాంటి చర్చ రేపిందో.. దాదాపు అలాంటి చర్చే తాజాగా సమంత తెచ్చేలా ఉందన్న మాట వినిపిస్తోంది. అక్కినేని నాగచైతన్యకు పీకల్లోతు ప్రేమలో ఉన్న సమంతతో వచ్చే ఏడాది పెళ్లి కన్ఫర్మ్ అయిన సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో తాజాగా వచ్చిన ఒక వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. అప్పట్లో మలయాళంలో సూపర్ హిట్ అయిన బెంగళూరుడేస్ చిత్రాన్ని తెలుగు.. తమిళ్ లో రీమేక్ చేస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. తెలుగు సినిమాను పక్కన పెడితే.. తమిళ్ వెర్షన్ లో సమంత నటించారు. మలయాళంలో నిత్యమీనన్ పోషించిన పాత్రలో సమంత యాక్ట్ చేశారు. ఇందలో సమంత బాయ్ ఫ్రెండ్ గా రానా నటించారు. తాజాగా బయటకు వచ్చిన సాంగ్ వీడియోలో.. ఈ సినిమాలో రానాతో సమంత చేసిన రొమాన్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికి పలు సినిమాల్లో సమంత యాక్ట్ చేసినా.. గతంలో ఏ సినిమాలో చేయనంత క్లోజ్ గా రానాతో చేయటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సమంత రొమాన్స్ ను చూసినోళ్లు.. ఈ సినిమాలో సమంత చెలరేగిపోయిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నార

No comments:

Post a Comment

About

Flickr