
రణ్బీర్ కపూర్-కత్రినా కైఫ్, సిద్ధార్ధ్ మల్హోత్రా-అలియా భట్ బ్రేకప్లు బాలీవుడ్నే కాక సినీ ప్రియులనూ ఆశ్చర్యపరిచాయి. సల్మాన్ ఖాన్ - లులియా వంటూర్, అనుష్క శర్మ-విరాట్ కోహ్లిలు కూడా ఇదే ట్రాక్లో ఉన్నారన్న వార్తలు వస్తున్నాయి. వీరికి తోడుగా మరో హైఫై బ్రేకప్ను బీ టౌన్ రుచి చూడనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఎవరబ్బా అంతటి ప్రముఖ కపుల్ అనేగా మీ సందేహం? అదే చెప్పబోతున్నాం.. ఆన్స్క్రీన్, ఆఫ్స్క్రీన్ల్లోనూ మంచి రొమాంటిక్ జోడీగా పేరుతెచ్చుకున్న 'బాజీరావ్ మస్తానీ'.. దీపికా పదుకోన్, రణ్వీర్ సింగ్ల మధ్య విబేధాలు వచ్చాయని సమాచారం. దీపిక తీరు రణ్వీర్లో అసంతృప్తి రాజేస్తోందట. ఈ విషయాన్ని సన్నిహితుల వద్ద చెప్పుకుని చాలా బాధపడ్డాడట మన 'బాజీరావ్'. 'మస్తానీ' తనను చాలా నిర్లక్ష్యం చేస్తోందని తెగ ఫీలైపోయాడట.
దీపిక సక్సెస్ను రణ్వీర్ కూడా సెలబ్రేట్ చేసుకుంటుంటాడు. ప్రియురాలికి కావాల్సిన దానికంటే ఎక్కువ సపోర్టే ఇస్తుంటాడు. సాధారణంగా ఏదైనా కార్యక్రమంలో ఇద్దరూ కనిపించారంటే ఆమె పట్ల చాలా కేర్ తీసుకుంటాడు. ఈ విషయం అతడి చర్యల్లోనే కాదు.. చూపుల్లోనూ తెలిసిపోతుంది. ఇక దీపు తొలి హాలీవుడ్ మూవీపైనా అతడు చాలా హడావిడే చేశాడు. సోషల్మీడియాలో ఆమెను మెచ్చుకుంటూ పలు మెసేజ్లు పెట్టాడు. అయితే రణ్వీర్ ఎగ్జైట్మెంట్కు దీపిక చాలా సాధారణంగా స్పందించిందట. ఈ రెస్పాన్సే అతడిని విపరీతంగా బాధపెట్టిందట. తన కొత్త సినిమా 'బేఫికర్' గురించి మెచ్చుకుంటూ మాట్లాడుతుందని అనుకున్న అతడికి ఆమె మౌనమే సమాధానమైందని సమాచారం. దీంతో తాను దీపిక గురించి తెగ ఇదై పోతున్నా, ఆమె మాత్రం ఏలాంటి ఫీలింగ్ చూపించడం లేదని రణ్వీర్ వాపోతున్నాడట. ఈ విషయాన్ని మీడియా మిత్రులు ఆరా తీయగా 'పీకూ' స్టార్ నోరు విప్పలేదు. రణ్వీర్ ప్రతినిధి మాత్రం ఈ వార్తలను తోసిపుచ్చాడు. వీరి స్వర్గంలో చిచ్చు మొదలైందన్న విషయం తేలాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే
commenting my posts and share it links
No comments:
Post a Comment