
పిల్లలు పుట్టడానికి వ్యక్తిగత ఇష్టాయిష్టాలు, సామాజిక పరిస్థితులు మాత్రమే కారణమని బలంగా నమ్ముతున్నారా? అయితే మీ ఆలోచన మార్చుకోవాల్సిందేనంటున్నారు పరిశోధకులు! పునరుత్పత్తికి జన్యుపరమైన మూలాలు కూడా కారణమవుతాయని చెబుతున్నారు. డీఎన్‌ఏ క్రమంపై ప్రత్యేకించి 12 అంశాలపై చేసిన అధ్యయనంలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. డీఎన్ఏ ఆధారంగా ఏ వయసులో సంతాన భాగ్యం కలుగుతుంది… మన జీవితంలో ఎంతమంది పిల్లలు పుడతారో కూడా ముందే చెప్పవచ్చునని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకుడు నికోలా బార్బస్ వెల్లడించారు. ‘‘మన జన్యువులు మన ప్రవర్తనను గుర్తించలేవు. అయితే తొలిసారి దానిని ప్రభావితం చేయగల డీఎన్ఏ కోడ్‌లోని కొన్ని అంశాలను గుర్తించాం’’ అని తెలిపారు. 2 లక్షల 38 వేల మంది పురుషులు, స్త్రీలకు తొలి సంతానం ఎప్పుడు కలిగింది… 3 లక్షల 30 వేల స్త్రీ పురుషులకు ఎంత మంది పిల్లలు ఉన్నారు అన్న దానిపై వివరాలు సేకరించారు. ఈ సమాచారాన్ని62 విభాగాలుగా చేసి విశ్లేషణ జరిపారు. త్వరలోనే ఈ అధ్యయనం ఆధారంగా… పిల్లల కోసం ఎంతకాలం ఎదురుచూడాలో డాక్టర్లు ముందుగానే చెప్పగలుగుతారని పరిశోధకులు అంటున్నారు. అంతేకాదు.. మీకు పుట్టబోయే సంతానానికి ఎప్పుడు ఎలాంటి వయో మార్పులు వస్తాయో కూడా ముందే చెప్పొచ్చునట. భావి తరాలను సంతానలేమి నుంచి కాపాడేందుకు కూడా తాజా పరిశోధన ఉపకరించగలదని ఆక్స్‌ఫర్డ్ ప్రొఫెసర్ మిలిండా మిల్స్ పేర్కొన్నారు.
No comments:
Post a Comment