
ఆలీ అంటే.. నిన్నటిదాకా హీరోయిన్‌లు, లేడీ యాంకర్‌లే భయపడ్డారు. తాజాగా ఆయన దెబ్బకి కమెడియన్‌లు, హీరోలు కూడా హైరానా పడుతున్నారు. ఆయన టంగ్ పవర్ అలాంటిది మరి. సమంత వంటి బడా హీరోయిన్‌లే ఆయన నోటి పవర్‌కి జడుసుకున్నారు. ఇక, సుమ, అనసూయ లాంటి యాంకరమ్మలయితే బెంబేలెత్తిన మాట వాస్తవం. దీనిని పక్కన పెడితే… రీసెంట్‌గా జరిగిన సప్తగిరి ఆడియో ఫంక్షన్‌లో ఆలీ చేసిన కామెంట్స్‌కి సునీల్ మనసు గాయపడిందట. ఆయన అన్న మాటలతో పూలరంగడు బాధపడ్డాడనే ప్రచారం జరుగుతోంది. ఇంతకీ అలీ ఏమన్నాడంటే.. కమెడియన్‌లు హీరోగా సత్తా చాటడం అనేది ఒక లాటరీ లాంటిది.. ఆ విషయం గుర్తుంచుకోవాలి అంటూ వ్యాఖ్యానించారు. లాటరీ ఒక్కసారి మాత్రమే తగులుతుందని తగిలాక ఆ డబ్బుతో రిలాక్స్ అయిపోవాలే గాని మళ్లీ లాటరీ కొనగూడదంటూ తూటా పేల్చాడు. అయితే ఇది హీరోలుగా వస్తున్న కమెడియన్లపైనే అయి వుంటుందంటూ అర్థం అవుతుంది. సప్తగిరిని తిరిగి కమెడియన్ గా చేయాలంటూ సలహా ఇవ్వటం కొసమెరుపు .అయితే అక్కడే వున్న కామెడీట్రాక్ హీరో సునీల్ పై పేల్చిన బాంబుగా చెప్పుకుంటున్నారంతా. అసలే పడుతూ లేస్తూ ఉన్న కెరీర్ గ్రాఫ్‌తో ఉన్న సునీల్‌కి ఆలీ కామెంట్స్‌తో నొచ్చుకున్నాడట. అంత డైరెక్ట్‌గా అంటాడని ఊహించలేదని వాపోయాడట. అయితే, ఆయన చెప్పింది కూడా వాస్తవమే కదా అంటూ ఫైనల్‌గా ఓ నిట్టూర్పు విడిచాడట. మరి, ఆలీనా మజాకా….?
No comments:
Post a Comment