Nestham Movie Creations

Tuesday, 8 November 2016

రామ్‌గోపాల్ వర్మకు రిప్లై ఇచ్చిన రాజమౌళి, నాగార్జున


తెలుగు సినిమాతో కెరియర్ ప్రారంభించి భారతీయ చిత్రపరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ... త్వరలో ప్రపంచ స్థాయి సినిమా తీయబోతున్నారు. 'న్యూక్లియర్‌' అనే అంతర్జాతీయ చిత్రాన్ని ఆయన తెరకెక్కించబోతున్నట్లు, ఈ చిత్రానికి రూ. 340 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు వర్మ అఫీషియల్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. వర్మ ఈ చిత్రం గురించి ప్రకటించగానే ఈ చిత్రాన్ని ఉద్దేశించి దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ట్విట్టర్‌లో ఇలా ఓ ట్వీట్‌ చేశారు. 'ఆర్‌జీవీ (రామ్‌గోపాల్‌ వర్మ) బ్యాక్‌ విత్‌ బ్యాంగ్‌..? నిజంగా' అని జక్కన్న ట్వీట్‌ చేశారు. దీనికి వర్మ వెంటనే ఇలా రిప్లై ఇచ్చారు... ‘‘సర్‌.. ఒకరోజు రాత్రి మీతో ఫోన్‌లో మాట్లాడుతూ బీబీ(బాహుబలి) నుంచి నేను పొందిన స్ఫూర్తి గురించి చెప్పాను. కచ్చితంగా బాహుబలి బ్యాంగ్ ఔట్ అని ఆనాడు నేనే చెప్పింది నేడు నిజమైంది’’ అని వర్మ ట్వీట్‌ చేశారు. వర్మ తీయబోతున్న సినిమా గురించి అక్కినేని నాగార్జున కూడా స్పందించారు. రామ్ గోపాల్ వర్మ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్‌లో ఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉంది. మనమంతా గర్వపడేలా వర్మ ఆ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తారని నాగార్జున ట్వీట్ చేశారు. నాగార్జునకు వర్మ రిప్లై ఇస్తూ హే నాగ్...అప్పట్లో నేను కొత్తవాడిని అయినా నాపై నమ్మకంతో శివ సినిమా చేసే అవకాశం ఇచ్చావు. నీకు 10 జన్మల పాటు రుణపడి ఉంటాను... అంటూ వర్మ నాగార్జునకు రిప్లై ఇచ్చారు. ‘‘న్యూక్లియర్ సినిమా గురించి గర్వపడుతున్నాను. మామూలు కాలేజ్ గొడవల్లో, సైకిల్ చైన్లతో కొట్టుకునే నేపధ్యంలో, నేను తీసిన "శివ" తో మొదలైన నా కెరియర్ ఇప్పుడు దేశాల మధ్య జరుగుతున్న గొడవల్లో న్యూక్లియర్ బాంబులు పేల్చుకునే నేపధ్యంలో ఇంగ్లీష్‌లో నిర్మించబోతున్న"న్యూక్లియర్" సినిమా వరకూ వచ్చినందుకు, నేను ఒకింత కాకుండా చాలా చాలా గర్వపడుతున్నాను’’... అని వర్మ తెలిపారు

No comments:

Post a Comment

About

Flickr