Nestham Movie Creations

Tuesday, 8 November 2016

ఆ వార్త పదేపదే వస్తే నా చావు వార్త వింటారు.. హీరోయిన్‌ సంచలన కామెంట్


అమలా రోజ్‌ కురియన్‌ అనే మలయాళ హీరోయిన్‌ చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తోంది. తన పేరుతోనే ఉన్న మరో నటి చేసిన తప్పు ఈమెను అప్రతిష్ట పాలు చేస్తోంది. కొద్ది రోజుల క్రితం కేరళలో అమల అనే నటి వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. దాంతో అందరూ అమలా రోజ్‌ కురియనే వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడిందని ప్రచారం ప్రారంభించారు. సోషల్‌ మీడియాలో కూడా అలాగే ప్రచారం చేశారు. దీనిపై అమలా రోజ్‌ కురియన్‌ తీవ్రంగా స్పందించింది. వ్యభిచారం చేస్తూ పట్టుబడింది తాను కాదంటూ వివరణనిచ్చింది. అయినా ఆ ప్రచారం ఆగలేదు. ‘ఈ వార్త మూలంగా గత వారం రోజులుగా నాకు నిద్ర పట్టడం లేదు. మధ్యతరగతి నుంచి వచ్చిన అమ్మాయిని నేను. కేవలం యాక్టింగ్‌ అంటే ఉన్న ఇష్టంతోనే ఇక్కడికి వచ్చా. ఇలాంటి వార్తల వల్ల ఆ ఆసక్తి తగ్గిపోతోంది. ఈ వార్తను పదే పదే ప్రచారం చేస్తున్నవారు నా ఆత్మహత్య వార్తను చూడాలనుకుంటున్నారా’ అంటూ ప్రశ్నించింది.

No comments:

Post a Comment

About

Flickr