
ఇండస్ట్రీలో కొన్ని సెంటిమెంట్లు హల్‌చల్ చేస్తుంటాయి. అలాంటి వాటిలో రాజమౌళితో సినిమా చేసిన హీరోయిన్ల కెరీర్ గ్రాఫ్ పడిపోతుందనేది ఒకటి. ఇది చాలా పాతది. ప్రస్తుతం అలాంటి సెంటిమెంట్ ఒకటి టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. పలు మంచి చిత్రాల్లో నటించినప్పటికీ ఒక్క బ్రేక్ కూడా ఖాతాలో వేసుకోలేకపోయిన సందీప్ కిషన్ చుట్టూ ఆ వార్త తిరుగుతోంది. ఈ యంగ్ హీరోతో చేసిన హీరోయిన్లు ఇండస్ట్రీ టాప్ హీరోయిన్లుగా వెలుగొందుతారనేది ఆ సెంటిమెంట్. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్లుగా వెలుగొందుతున్న వాళ్లు తమ కెరీర్ ప్రారంభంలో ఈ హీరోతో చేసినవాళ్లే. ఉదాహరణకు తీసుకుంటే, రెజీనా, రకుల్, రాశీఖన్నా. రెజీనాతో రొటీన్ లవ్ స్టోరీ, రారా కృష్ణయ్య, రకుల్‌తో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, రాశీ ఖన్నాతో జోరు వంటి సినిమాలు చేశాడు సందీప్ కిషన్. ఇంకేముంది ఆ సినిమాలు పూర్తయిన వెంటనే రెజీనాకు రవితేజ, సాయి ధరమ్ తేజ, రకుల్‌కు గోపీచంద్, రామ్, రవితేజ, రామ్ చరణ్, ఎన్టీఆర్, రాశీఖన్నాకు గోపీచంద్, రామ్, రవితేజ వంటి హీరోలతో ఆపర్లు వచ్చాయి. వాటిని చక్కగా వినియోగించుకున్న ఆ హీరోయిన్లు నేడు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లుగా చలామణి అవుతున్నారు. ప్రస్తుతం సందీప్‌తో చేస్తున్న ప్రజ్ఞా జస్వాల్ కూడా ఈ సినిమా తరువాత బిజీ హీరోయిన్ అవుతుందని టాలీవుడ్‌లో కొందరు జోస్యం చెబుతున్నారు. దీంతో సందీప్‌తో సినిమా చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు పలువురు హీరోయిన్లు. ఈ క్రమంలోనే తెలుగులో బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న మరో ముద్దుగుమ్మ కూడా సందీప్ సరసన నటించాలనుకుంటోందని, ‘క్రిష్ణగాడి వీరప్రేమగాథ’ వంటి హిట్ దక్కినా బిజీ కాలేకపోయిన మెహరీన్ కౌర్ సైతం సందీప్‌కు సై అందని చెప్పుకుంటున్నారు. ఒకరకంగా చూస్తే సందీప్ సెంటిమెంట్ నిజమే అనిపిస్తోంది కదా. కానీ, ఆ కలిసొచ్చేదేదో ఒక్క హీరోయిన్లకే కాక, సందీప్‌కి కూడా కలిసొస్తే బాగుంటుది కదా!
No comments:
Post a Comment