Nestham Movie Creations

Tuesday, 8 November 2016

ఈ జాకెట్‌ అదుర్స్‌


లెదర్‌ జాకెట్‌ వేసుకుంటే ఆ హుందాయే వేరు. సాధారణంగా లెదర్‌ జాకెట్‌లో లోపల రెండు, బయట రెండు పాకెట్స్‌ ఉంటాయి. ఒక స్మార్ట్‌ఫోన్‌, చిన్న పాకెట్‌బుక్‌ పెట్టుకోవడానికి సరిపోతుంది. కానీ ‘స్కాటెవెస్ట్‌’ అనే స్టార్టప్‌ కంపెనీ ఏకంగా 29 పాకెట్లు ఉన్న జాకెట్‌ను రూపొందించింది. ఈ జాకెట్‌లో రెండు ల్యాప్‌టాప్‌లను సైతం పెట్టుకోవచ్చు. ‘ఆఫ్‌ ద గ్రిడ్‌’ పేరుతో రూపొందించిన ఈ జాకెట్‌ పూర్తి వాటర్‌ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంటుంది. ఇందులో ఉన్న మరో ఫీచర్‌ ఏంటంటే క్లియర్‌ టచ్‌ ప్యాకెట్స్‌ ఉంటాయి. వాటిలో స్మార్ట్‌ఫోన్‌ వంటి డివైజ్‌ను పెట్టుకుంటే జేబులో నుంచి బయటకు తీయకుండానే డివైజ్‌ను చూడటం, టచ్‌స్ర్కీన్‌ను ఉపయోగించడం చేయవచ్చు. పురుషులు, స్త్రీలు తేడా లేకుండా ధరించే వీలున్న ఈ జాకెట్‌ ధర సుమారు రూ.15 వేలుగా ఉంది.

No comments:

Post a Comment

About

Flickr