
ప్రముఖ ఫిలింమేకర్ రాంగోపాల్ వర్మ అంటే తెలియనివాళ్లుండరు. ఆయన్ని, అతడి లైఫ్ స్టైల్‌ని విమర్శించే వారి సంఖ్య ఎంత ఉంటుందో... అలాగే అతడిని ఇష్టంగా అభిమానించే వారి సంఖ్య కూడా అంతే వుంటుంది. ముఖ్యంగా వర్మ ఫిలింమేకింగ్ స్టైల్ అతడికి చాలామంది అభిమానుల్ని సంపాదించిపెట్టింది. జీవితాన్ని అందరికన్నా భిన్నమైన కోణంలో చూడటానికి ఇష్టపడే రాంగోపాల్ వర్మ... తాను తీసిన చిత్రాల్లోనూ తన అభిమతాన్నే జొప్పిస్తుంటాడనే సంగతి అందరికీ తెలిసిందే.
'నా ఇష్టం' అని ఓ బుక్కు రాసుకున్నా.... ''నా సినిమాల్ని చూస్తే, చూడండి.. లేకపోతే లేదు! అది మీ ఇష్టం'' అని నిక్కచ్చిగా స్టేట్‌మెంట్లు ఇచ్చినా అది వర్మకి మాత్రమే చెల్లింది. "వర్మ ఎలాంటోడో నాకు బాగా తెలుసు అని కొందరంటే... వర్మ ఎవ్వరికీ ఒక పట్టాన అర్థం కాడు" అని ఇంకొందరు అంటుంటారు. అందుకేనేమో ఇప్పుడు వర్మ జీవితాన్ని అధ్యయనం చేయడానికి ఓ రిసెర్చ్ స్కాలర్ ముందుకొచ్చినట్టు తెలుస్తోంది.
No comments:
Post a Comment