Nestham Movie Creations

Sunday, 6 November 2016

టాయిలెట్‌తో ప్రేమలో పడ్డ అక్షయ్ కుమార్!


బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ టాయిలెట్‌తో ప్రేమలో పడ్డారు. యాక్ అదేంటి అనుకుంటున్నారా? ఇంతకూ విషయం ఏంటంటే ఆయన ‘టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథా’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ ఆదివారమే ప్రారంభమైంది. ఆ మూవీ షూటింగ్ సందర్భంగా షూటింగ్ సెట్లో టాయిలెట్ దగ్గర నిలబడి హీరోయిన్ భూమి పడ్నేకర్‌తో సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారాయన. ఆ ఫొటోకు వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ భూమి అండ్ మీ ఫ్రమ్ ద సెట్స్ అంటూ క్యాప్షన్ తగిలించాడు. ఇదో ప్రేమ కథా చిత్రమట. ఈ ఫొటోలో హీరోయిన్ కొత్తగా పెళ్లయిన అమ్మాయిలా కనబడుతోంది. సినిమాకు సినిమాకు విభిన్నంగా కథలు ఎంచుకుంటున్న అక్షయ్ కుమార్ ఈసారి కూడా ఢిపరెంట్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారేమో అనిపిస్తోంది. నీరజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్వచ్ఛభారత్ నేపథ్యంలో హాస్యభరితంగా తెరకిక్కించనున్నట్లు తెలుస్తోంది. శంకర్ దర్శకత్వంలో రజనీ హీరోగా తెరకెక్కుతున్న రోబో 2 సినిమాలో అక్షయ్ విలన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే

No comments:

Post a Comment

About

Flickr