Nestham Movie Creations

Sunday, 6 November 2016

పాత సినిమా సీక్వెల్లో సల్మాన్ - గోవిందా ?


పార్ట్‌నర్ సినిమాలో సల్మాన్ ఖాన్, గోవిందాసల్మాన్ ఖాన్ - గోవిందాల కాంబినేషన్‌లో 2007లో రిలీజైన పార్ట్‌నర్ సినిమాని చూసినవారికి అందులో ఆ ఇద్దరి మధ్య చోటుచేసుకునే హాస్యపూరిత సన్నివేశాలు బాగానే గుర్తుండివుంటాయి. ఫన్నీగా వుండే మల్టీస్టారర్ సినిమాల్లో పార్ట్‌నర్ సినిమాకు వుండే గుర్తింపే వేరు. ఆ సినిమా తర్వాత మరే సినిమాలోనూ కలిసి నటించని ఈ స్టార్ హీరోలిద్దరూ తాజాగా మళ్లీ పార్ట్‌నర్ మూవీ సీక్వెల్ కోసం కలిసి నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది. అప్పట్లో ఒరిజినల్ వెర్షన్‌ని డైరెక్ట్ చేసిన డేవిద్ దావన్ ప్రస్తుతం తన తనయుడు వరుణ్ ధావన్‌ని హీరోగా పెట్టి 'జుడ్వా' అనే పాత హిట్ సినిమాకి సీక్వెల్ తెరకెక్కించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. దీంతో పార్ట్‌నర్ సీక్వెల్‌ని డైరెక్ట్ చేసే అవకాశం సాజిద్-ఫరద్‌లకి దక్కిందని సమాచారం. అయితే, ఈ సీక్వెల్లో సల్మాన్-గోవిందాలు కలిసి నటిస్తారా లేక మొత్తం కొత్త హీరోలని తీసుకుంటారా అనే వివరాలని ప్రొడక్షన్ వర్గాలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.

No comments:

Post a Comment

About

Flickr