
అమెరికా లాస్ ఏంజిల్స్‌లో సాగిన ఎమ్మీస్ అవార్డ్స్‌లో ప్రియాంక చోప్రా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. రావిషింగ్ రెడ్ గౌన్‌లో అమ్మడు చేసిన హంగామాకు చాలామంది ఫ్లాటై పోయారు. ఆమెతో కలిసి అవార్డ్ ప్రజంట్ చేసిన హాలీవుడ్ స్టార్ టామ్ హిడిల్‌స్టన్ కూడా పీసీ హల్‌చల్‌కు ముగ్ధుడైపోయాడు. ఇక స్టేజ్‌పై కలిసి వస్తుండగా ఈ 'బాజీరావ్ మస్తానీ' బ్యూటీ వయ్యారంగా ఓ రౌండ్ తిరిగింది. ఈ మూవ్‌మెంటే ఆసక్తిగా మారింది. ఇదే విషయమై పీసీ వివరణ ఇస్తూ టామ్ చెప్పడం వల్లే అలా తిరిగానని అంది.
ఏమ్మీస్ ప్రజెంటేషన్స్ కోసం జాసన్ వు డిజైన్ చేసిన ఎరుపు రంగు గౌన్‌లో ప్రత్యక్షమైంది మన ప్రియాంక. రెడ్ కార్పెట్‌పైకి ఆమె రాగానే ఫొటోగ్రాఫర్స్ అంతా తమ కెమేరాలకు పనిచెప్పారు. అలలాంటి గౌనును చేత్తో తిప్పాలంటూ కొందరు, ఆమెనే తిరగాలంటూ మరి కొందరు కోరారు. "ఈ ట్విర్లింగ్ మూవ్‌మెంట్‌నే స్టేజ్‌పైనా రిపీట్ చెయ్యి" అంటూ టామ్ పీసీకి చెప్పాడట. అతడు చెప్పినట్టే వేదికపై కొన్ని అడుగులు వేసిన ప్రియాంక నెమ్మదిగా ట్విర్ల్ చేసి అందరినీ అలరించింది. ఇదిలా ఉంటే, ప్రియాంక, టామ్ మధ్య స్నేహానికి మించిన బంధం ఉందంటూ అమెరికన్ మీడియాలో వార్తలొచ్చాయి. టామ్ ప్రముఖ పాప్ గాయని టేలర్ స్విఫ్ట్ మాజీ బోయ్‌ఫ్రెండ్. ఇటీవలే వారిద్దరికీ బ్రేకప్ అయింది
No comments:
Post a Comment