ఒక హీరోయిన్‌కు ఆమె కంటే పెద్ద స్థాయిలో ఉన్న హీరోయిన్ అభిమాని అని తెలిస్తే ఎంత ఆనందం కలుగుతుందో కదా. మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు ఆ ఫీలింగ్‌లోనే ఉంది. గొప్ప నటిగా పేరు తెచ్చుకుని.. బాలీవుడ్ అగ్ర హీరోయిన్లలో ఒకరిగా ఎదిగిన కంగనా రనౌత్.. తమన్నాకు పెద్ద అభిమాని అట. ఆమె సినిమాలు క్రమం తప్పకుండా చూస్తుందట. అసలెవరూ వేలెత్తి చూపించడానికి వీలు లేనట్లుగా తమన్నా నటిస్తుందని.. ఆమె నటనంటే తనకు చాలా ఇష్టమని పొగిడేసింది కంగనా. తమన్నా కొత్త సినిమా 'అభినేత్రి' హిందీలో టూటక్ టూటక్ టూటక్ (టు ఇన్ వన్) పేరుతో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన కంగనా.. తమన్నా మీద ప్రశంసలు జల్లు కురిపించింది. తాను తమన్నాకు పెద్ద అభిమానని అన్న కంగనా.. తమన్నా చాలా ప్రొఫెషనల్ అని కితాబిచ్చింది. ఆమె నటించిన సినిమాలన్నీ తాను చూస్తుంటానని కంగన తెలిపింది. వేలెత్తి చూపించడానికి వీల్లేనంత గొప్పగా తమన్నా నటిస్తుందని.. 'టు ఇన్ వన్'లో ఆమె ఎలా నటించిందో చూద్దామని ఆసక్తిగా ఉందని చెప్పింది. మూడు జాతీయ అవార్డులు గెలుచుకున్న నటి తననిలా పొగిడేయడంతో తమన్నా ఉబ్బితబ్బిబ్బయిపోయే ఉంటుంది. ఇక తమన్నా బాలీవుడ్ కెరీర్ విషయానికి వస్తే.. ఆమె నటించిన డైరెక్ట్ హిందీ సినిమాలు హిమ్మత్ వాలా.. ఇట్స్ ఎంటర్టైన్మెంట్ పెద్ద డిజాస్టర్లయ్యాయి. ఐతే 'బాహుబలి' అక్కడ ఆమెకు మంచి పేరు తెచ్చింది. ఇప్పుడు 'టూటక్ టూటక్ టూటక్'తో మరో హిట్టు కొడతానని ఆశతో ఉంది తమ్మూ

No comments:
Post a Comment