సూర్య కొత్త సినిమా 'సింగం-3' ఫినిషింగ్ స్టేజ్‌లోకి వచ్చేసింది. ఈ నెలలోనే ఆ సినిమా షూటింగ్ మొత్తం అయిపోతుంది. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి అక్టోబర్లోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేవాలని చూస్తున్నాడు హరి. ఇంతలో తన తన తర్వాతి సినిమాకు కూడా సన్నాహాలు చేసుకుంటున్నాడు సూర్య. తన తమ్ముడు కార్తితో 'కొంబన్' అనే సినిమా చేసి.. ఈ మధ్యే విశాల్‌తో మరుదు (తెలుగులో రాయుడు) అనే సినిమాతో పలకరించిన ముత్తయ్య అనే యువ దర్శకుడితో పని చేయబోతున్నాడు సూర్య. రూరల్ బ్యాక్ డ్రాప్‌ల సినిమాలు చేయడంలో ముత్తయ్య స్పెషలిస్టు. సూర్యకు కొంచెం భిన్నంగా ఉంటుందని ఆ టైపు సినిమానే చేయబోతున్నాడు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లను ఫిక్సయ్యారు. తెలుగులో 'నేను శైలజ'తో కుర్రాళ్ల మనసు తోచి.. ఇటీవలే నానితో ఓ సినిమాకు ఎంపికైన కీర్తి సురేష్ సూర్య పక్కన ఓ హీరోయిన్‌గా ఎంపికైంది. ఇంకో హీరోయిన్‌గా సాలా ఖడూస్ (తమిళంలో ఇరుదు సుట్రు) భామ రితికా సింగ్‌ను ఎంపిక చేశారు. తమిళంలో టాప్ హీరోయిన్‌గా ఎదుగుతున్న కీర్తి.. సూర్యకు సరైన జోడీ అవుతుందని భావిస్తున్నారు. సూర్య గత సినిమాల్లాగే దీన్ని కూడా ఒకేసారి తెలుగులోనూ రూపొందిస్తారట. ఐతే సూర్యను ఎక్కువగా క్లాస్.. స్టైలిష్ క్యారెక్టర్లలోనే చూసిన తెలుగు ప్రేక్షకులు ముత్తయ్య మార్కు ఊర మాస్ క్యారెక్టర్లో చూస్తే ఎలా ఫీలవుతారో చూడాలి మరి -

No comments:
Post a Comment