
గత కొన్నేళ్లలో సౌత్ ఇండియన్ సినిమాల్లో వచ్చిన బెస్ట్ హీరోయిన్ క్యారెక్టర్ల లిస్టు తీస్తే టాప్‌లో 'ప్రేమమ్' సినిమాలోని మలార్ పాత్రే ఉంటుందనడంలో సందేహం లేదు. ఆ పాత్ర వేసిన ఇంపాక్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ఆ పాత్రలో గొప్పగా ఒదిగిపోయింది. గొప్ప అందగత్తె కాకపోయినా పాత్రకు తగ్గట్లుగా కుదిరిన సాయిపల్లవి కోట్లాదిమంది కుర్రాళ్ల మనసుల్ని కొల్లగొట్టింది. కేవలం మలయాళ ప్రేక్షకులే కాదు.. వేరే భాషల వాళ్లు కూడా ఆమెను చూసి ఫిదా అయిపోయారు.
ఈ పాత్రనే తెలుగులోకి వచ్చేసరికి శ్రుతి హాసన్‌తో చేయించాడు దర్శకుడు చందూ మొండేటి. ఐతే మలార్ పాత్రకు శ్రుతిని ఎంచుకున్న నాటి నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడుస్తోంది. తాజాగా 'ఎవరే' పాట రిలీజ్ చేశాక ఆ ట్రోలింగ్ మరింత తీవ్ర రూపం దాల్చింది. శ్రుతి హాసన్‌ను టార్గెట్ చేసి దూషణలకు దిగడమే కాక.. ఆమె గురించి ఎగతాళిగా మాట్లాడుతున్నారు జనాలు. ఎవరే.. పాటలో ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ గురించి కూడా ట్రోలింగ్ ఓ రేంజిలో సాగుతోంది.
ఒక పాత్రలో ఒకరు బలమైన ముద్ర వేశాక.. ఇంకెవరు ఆ పాత్రలోకి వచ్చినా బాగా చేయనట్లే కనిపిస్తుంది. అది సహజం. మలార్ పాత్ర మీద.. సాయిపల్లవి మీద ఎంతైనా అభిమానం ఉండొచ్చు కానీ.. అంతమాత్రాన శ్రుతిని టార్గెట్ చేయడమే చిత్రం. ఇందులో ఆమె చేసిన తప్పేముంది? నటన విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో స్టయిల్ ఉంటుంది. ఒకరిలా ఇంకొకరు ఎలా కనిపిస్తారు.? ఇవేమీ ఆలోచించకుండా జనాలు శ్రుతిని సాయిపల్లవితో పోలుస్తూ ఎగతాళిగా మాట్లాడేయడం ఎంత వరకు సబబో వారికే తెలియాలి
No comments:
Post a Comment