Nestham Movie Creations

Saturday, 12 November 2016

అనుష్క కష్టాలు ఇన్నిన్ని కాదయా.


అనుష్క కష్టాలు ఇన్నిన్ని కాదయా..అడుసు తొక్కనేల.. కాలు కడగనేల అంటారు. అనుష్క పరిస్థితి ప్రస్తుతం అలాగే ఉంది. బరువు పెరగనేల.. ఇప్పుడు తగ్గించుకోవడానికి అంత కష్టపడనేల అనుకుంటున్నారు జనాలు ఆమెను చూసి. హీరోయిన్లు బరువు పెరగడం ఏముంది.. మాంచి తిండి తింటే నెల రోజుల్లో షేపులు మారిపోతాయి. అనుష్క కూడా అలాగే ‘సైజ్ జీరో' కోసం సింపుల్ గా బరువు పెరిగిపోయింది. కానీ ఆ బరువు తగ్గించుకోవడానికే ఇప్పుడు నానా కష్టాలు పడుతోంది. తన ఒంట్లోకి అదనంగా వచ్చి పడిన 20 కిలోల బరువును తగ్గించుకోవడానికి ఏడెనిమిది నెలల నుంచి కష్టపడుతోంది అనుష్క. కానీ ఇప్పుడు ఆమె కోరుకున్న స్థాయికి బరువు తగ్గలేదట. యోగా టీచర్ కూడా అయిన అనుష్క.. తనకు తెలిసిన మార్గాల్లో ప్రయత్నాలన్నీ చేసేసింది. యోగా చేసింది.. జిమ్ లో వ్యాయామాలూ చేసింది. అయినా అనుకున్న స్థాయికి బరువు తగ్గకపోవడంతో ప్రస్తుతం సైక్లింగ్ మీద దృష్టిపెట్టిందట అనుష్క. సైక్లింగ్ అంటే.. జిమ్ లో కూర్చుని డమ్మీ సైకిల్ తొక్కడం కాదు. నిజంగానే సైకిలేసుకుని రోడ్ల మీద చక్కర్లు కొడుతోందామె. ఐతే అనుష్క అలా సైకిల్ తొక్కేస్తూ వెళ్తుంటే జనాలు ఊరుకుంటారా..? అందుకే ఆమె ముఖానికి మాస్క్ వేసుకుని సైకిల్ సవారీ చేస్తోందట. రోజుకు 20 కిలోమీటర్ల దాకా ఆమె సైకిల్ తొక్కుతున్నట్లు సమాచారం. ఐతే ఈ ప్రయత్నం మంచి ఫలితమే ఇస్తోందని.. అతి త్వరలోనే నాజూగ్గా తయారైపోతానని ధీమా వ్యక్తం చేస్తోంది అనుష్క

No comments:

Post a Comment

About

Flickr