Nestham Movie Creations

Wednesday, 9 November 2016

నేడు అనంతపురం పవన్‌ కళ్యాణ్ ప్రత్యేక గర్జన.. బహిరంగ సభకు భారీ బందోబస్తు

pawan kalyan
 ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ గురువారం అనంతపురంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ప్రత్యేక గర్జన కోసం సీమాంధ్ర హక్కుల జన చైతన్య సభ పేరు
తో నిర్వహిస్తున్న ఈ బహిరంగ సభ స్థానిక న్యూటౌన్‌ జూనియర్‌ కళాశాల గ్రౌండులో సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సభకు వేలాది మంది హాజరవుతున్న నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. దాదాపు 1800 మంది పోలీసులు బందోబస్తు విధుల్లో నిమగ్నమయ్యారు. మరోవైపు ప్రజలు, అభిమానులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా 600 మంది జనసేన వాలంటీర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. రాయలసీమ జిల్లాల నుంచి అభిమానులు పెద్ద ఎత్తున వాహనాల్లో తరలిరావచ్చన్న ఉద్దేశ్యంతో ట్రాఫిక్‌ను మళ్లించారు. వాహనాల పార్కింగ్‌ కోసం ప్రత్యేకంగా స్థలాలను ఏర్పాటు చేశారు. బహిరంగ సభను విజయవంతం చేసేందుకు జనసేన నాయకులు, కార్యకర్తలు, పవన్‌ అభిమానులు కృషిచేస్తున్నారు. ఈ సభలో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ ఇప్పటికే అనంతపురానికి చేరుకున్నారు.

No comments:

Post a Comment

About

Flickr