
అక్కినేని వారసుడు నాగచైతన్య, లవ్లీ బ్యూటీ సమంత త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఈ సమయంలో సమంత ముందే మరో అమ్మాయితో రొమాన్స్ చేస్తే. చేస్తేకాదు, చేస్తాడట. దీనికి సంబంధించి పలు ఆసక్తికర వార్తలు టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. పెళ్లితో ఒక్కటవబోతున్నప్పటికీ ఈ హీరోహీరోయిన్లు మరో రెండేళ్లు ఖాళీగా ఉండకుండా పలు సినిమాలకు సంతకాలు చేశారు. ప్రస్తుతం సమంత కోలీవుడ్‌లో రెండు, టాలీవుడ్‌లో రెండు చిత్రాలకు అంగీకరించింది. మరోవైపు, నాగచైతన్య ‘ప్రేమమ్’ విజయం తరువాత ‘సోగ్గాడే చిన్నినాయనా’ దర్శకుడు కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నటించబోతున్నాడు. నవంబర్ 9వ తేదీ నుంచి షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా ఎంపికైంది. అయితే, ఈ సినిమాలో రకుల్‌తో పాటు సమంత కూడా మరో పాత్ర చేయనుందట. కొన్ని సన్నివేశాల్లో సమంత ముందే చైతూ రకుల్‌తో రొమాన్స్ చేయనున్నాడని ఫిలింనగర్ జనాలు మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు, సినిమాపై క్రేజ్ తీసుకురావడం కోసమే ఇలాంటి సన్నివేశాలను ప్లాన్ చేస్తున్నట్లుగా కూడా చెప్పుకుంటున్నారు.
No comments:
Post a Comment