Nestham Movie Creations

Wednesday, 9 November 2016

కాంపిటీటివ్‌ ఎగ్జామ్‌ పేపర్లో సన్నీలియోన్‌!


పోర్న్‌స్టార్‌ నుంచి బాలీవుడ్‌ తారగా మారిన సన్నీ లియోన్‌ పేరు పబ్లిగ్గా పలకడానికే చాలామంది సందేహిస్తూ ఉంటారు. అలాంటిది ఓ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఎగ్జామ్‌లో ఆమె పేరునే ముద్రించేశారు. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఎగ్జామ్‌ అంటే ఎంతో కఠినాత్మకంగా ఉంటుంది. కానీ, కేరళ ప్రభుత్వం పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఎగ్జామ్‌ పరువు తీసింది. ‘ఆల్ఫాబెట్‌ సూప్‌ ఫర్‌ లవర్స్‌’ పుస్తకం రాసింది ఎవరు అనే ప్రశ్న ఇచ్చి.. దానికి కింద ఇచ్చిన మల్టిపుల్‌ చాయిస్‌ ఆప్షన్స్‌లో సన్నీలియోన్‌ పేరు ఇచ్చారు. అది చూసిన అభ్యర్థులు వెంటనే షాకయ్యారు. ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

No comments:

Post a Comment

About

Flickr