
ముగ్గురు మహిళ జీవితాల్లోని కష్ట నష్టాలకు తెరరూపంగా నిలిచిన 'పార్చ్డ్' సినిమాను విమర్శకులు ఆకాశానికెత్తేశారు. ఇప్పటికే అంతర్జాతీయ సినీ వేడుకల్లో పలు పురస్కారాలు కైవసం చేసుకున్న ఈ చిత్రం భారత్‌లో ఇటీవలే విడుదలైంది. ఫలితం సంగతి పక్కన పెడితే ఈ మూవీ విడుదలకు ముందూ.. ఆ తర్వాత సృష్టించిన సంచనాలు అన్నీఇన్నీ కావు. చిత్ర కథానాయిక రాధిక ఆప్టే సెక్స్ సీన్స్ లీకేజీలు, దానిపై ఆమె వివరణలతో ఎంటర్టైన్‌మెంట్ న్యూస్‌కు కొత్త జోష్ లభించినట్టైంది. తనపై విమర్శలు చేస్తున్నవారి నోళ్లు మూయించేందుకు ఆమె మరిన్ని బోల్డ్ కామెంట్స్ చేస్తూ మీడియాలో సందడి చేసింది. తెరపై న్యూడ్‌గా కనిపించేందుకు తనకేమీ సిగ్గులేదంటూ చర్చకు తెరతీసింది.
ఇదిలా ఉంటే, పార్చ్డ్ గురించి, ఆమె బోల్డ్ యాక్ట్ గురించి అనేక ప్రశ్నలు ఇప్పటికీ రాధికను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వీటికి తాజాగా తనదైన శైలిలో స్పందించిందీ టాలెంటెడ్ యాక్ట్రస్. 'పార్చ్డ్' కోసం ఆదిల్ హుస్సేన్‌తో సెక్స్ సీన్‌లో నటించడంపై జనాలు తప్పుగా రాస్తున్నారు గానీ దాంట్లోని అసలు భావాన్ని ఎవ్వరూ గుర్తించడంలేదని చెప్పుకొచ్చింది. ఈ సీన్ చిత్రీకరణ చాలా వినోదాత్మకంగా గడిచిందని తెలిపింది. 'ఆదిల్‌తో ఉన్న ఇంటిమేట్ సీన్‌పై ప్రేక్షకులు జాలి కురిపించడమో లేదా ఆగ్రహం వ్యక్తం చేయడమో చేస్తున్నారు. కానీ ఆ సీన్ షూట్ ఎంత ఉల్లాసంగా గడిచిపోయిందనే విషయాన్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేద'ని అంది. ఆ సీన్ చిత్రీకరణప్పుడు కడుపు చెక్కలయ్యేలా నవ్వానని పేర్కొంది. అయిపోయిన పెళ్లికి బాజాలు అన్నట్లు 'పార్చ్డ్' సినిమా విడుదలైపోయినా.. సీన్స్ లీకేజీలపై ఇప్పటికీ చర్చ సాగడం హాస్యాస్పదంగా ఉందని కొందరు అంటున్నారు. ఎవ్వరేమన్నా ఈ చిత్రం ద్వారా రాధికకు దేశవ్యాప్తంగా ప్రచారం లభించింది.
No comments:
Post a Comment