Nestham Movie Creations

Saturday, 12 November 2016

'నా సినిమా హిట్టయినా.. ఫ్లాపైనా నేను పట్టించుకోను


'నా సినిమా హిట్టయినా.. ఫ్లాపైనా నేను పట్టించుకోను'ప్రేమమ్ సినిమా రిజల్ట్ ఆనందం కంటే కూడా తనకు పెద్ద రిలీఫ్ ఇచ్చిందని అంటోంది శ్రుతి. మామూలుగా తన సినిమాల జయాపజయాల గురించి తాను పెద్దగా పట్టించుకోనని.. కానీ ‘ప్రేమమ్’ మాత్రం దానికి భిన్నమని శ్రుతి చెప్పింది. ఈ సినిమాకు ముందు తాను చేయబోయే పాత్ర గురించి జరిగిన నెగెటివ్ ప్రచారమే అందుకు కారణమని శ్రుతి అంది. నిజానికి ఆ ప్రచారాన్ని తాను పెద్దగా పట్టించుకోకపోయినా.. సినిమా విషయంలో, తన పాత్ర విషయంలో ఏదైనా తేడా జరిగి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని ఆమె వ్యాఖ్యానించింది. ‘‘నా సినిమా హిట్టయినా.. ఫ్లాపైనా నేను పెద్దగా పట్టించుకోను. సినిమా విడుదల కావడాన్ని నేను ఒక పుట్టిన రోజులాగా భావిస్తా. బర్త్ డే రోజుకు మనం ఒక ఏడాది పెద్దవాళ్లయిపోయినట్లే.. ఒక సినిమా విడుదలవగానే మన జాబితాలోకి ఇంకో సినిమా పడుతుంది. బాధ్యత పెరుగుతుంది. ఒక సినిమా హిట్టయినా.. మనం చేసిన పాత్రకు మంచి పేరొచ్చినా మరింత బాధ్యతగా ఉండాలని అర్థం. అందుకే సినిమా హిట్టయితే పెద్దగా ఎగ్జైట్ అయిపోను. అదే సమయంలో సినిమా ఫ్లాప్ అయినా బాధపడను. కాకపోతే ‘ప్రేమమ్’ విషయంలో ఏం జరిగిందో నాకు తెలుసు. అప్పట్లో అదే పనిగా సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. నేను ఫోన్ చేసి కూడా ఇక్కడి వాళ్లను అడిగాను. అసలేం జరుగుతోందని. అందుకే సినిమా విడుదల తర్వాత పాజిటివ్ రెస్పాన్స్ రావడం చూసి చాలా రిలీఫ్‌గా అనిపించింది. నా పాత్ర అంత బాగా వచ్చిందంటే అందుకు మొత్తం క్రెడిట్ దర్శకుడు చందూ మొండేటికే దక్కుతుంది. అతను నా పాత్ర మీద అంత కేర్ తీసుకున్నాడు’’ అని శ్రుతి చెప్పింది.

No comments:

Post a Comment

About

Flickr