
అందానికి సిసలైన నిర్వచనం ఐశ్వర్య రాయ్. ఎంతో మంది బ్యూటీ క్వీన్‌లు వచ్చారు. వస్తున్నారు. కానీ ఐష్‌తో సరితూగే సౌందర్యం మాత్రం వారికేమాత్రం లేదనడం అతిశయోక్తి కాదేమో. పెళ్లై పాప పుట్టినా ఆమె అందం ఏమాత్రం చెక్కు చెదరలేదు. అందుకే ఈ సౌందర్యరాశిని చూసినవారెవరైనా ఆమె నుంచి చూపు తిప్పుకోలేరు. ఇటీవలి ఫిల్మ్ ఫేర్ గ్లామర్ అండ్ స్టైల్ అవార్డ్స్ వేడుకలోనూ అందరినీ కట్టిపడేసిందీ 'ఏ దిల్ హై ముష్కిల్' స్టార్. అదే కార్యక్రమానికి హాజరైన ఎవర్‌గ్రీన్ బ్యూటీ స్టార్ రేఖ కూడా ఐష్ అందానికి ఫ్లాటై పోయారు. ఆమెను చూసి ఒకింత పొంగిపోతూనే సరదాగా ఓ కామెంట్ చేశారు.
"ఐష్ అందానికి కారణమేంటో తెలుసా? ఆమె తల్లి బృందా గర్భవతిగా ఉన్నప్పుడు నా ఫొటోలే తీక్షణంగా చూస్తుండేది. అందుకే ఐశ్వర్య ఇంత అందంగా పుట్టింది". ఇదీ బిగ్ బీ కోడలు గూర్చిన రేఖ కామెంట్. రేఖ వ్యాఖ్యానంతో ప్రేక్షకులంతా పగలబడి నవ్వేశారు. ఈ పురస్కారాల వేడుకలో ఐష్, రేఖ తన చేతుల మీదుగా మోస్ట్ గ్లామరస్ స్టార్ (మహిళా విభాగంలో) అవార్డును అందుకుంది. పురస్కారం అందుకున్న ఐష్ కూడా "అమ్మ చేతుల మీదుగా ఈ అవార్డ్ అందుకోవడం చాలా గొప్పగా ఉంది" అంటూ రేఖపై అభిమానం చాటుకుంది
No comments:
Post a Comment