
బాలీవుడ్ స్టార్స్ జీవితాలు దాదాపుగా పబ్లిక్‌కు సుపరిచతమే. అఫైర్స్, బ్రేకప్స్ అన్నింటినీ చాలామంది బాహాటంగానే ఒప్పేసుకున్నారు. అయితే ఇలాంటి వ్యవహారాలతో బాలీవుడ్ ఫ్యాషనిస్టా సోనమ్ కపూర్ వార్తల్లో ఉన్నది తక్కువే. రణ్‌బీర్ కపూర్‌తో ఈ చిన్నది ప్రేమలో ఉన్నట్లు, విడిపోయినట్లు ఎప్పుడో వార్తలొచ్చాయి గానీ ఆ తర్వాత ఆమె లవ్ మ్యాటర్స్ గురించిన న్యూస్ ఏదీ హల్‌చల్ చేయలేదు. వ్యక్తిగత జీవితం లైమ్ లైట్‌లోకి రాకుండా సోనమ్ బాగానే జాగ్రత్తపడింది. అయితే ఈ వ్రతానికి అమ్మడు దాదాపు చెక్ పెట్టేసినట్లే కనిపిస్తోంది. 31ఏళ్లున్న తాను ఖాళీగా లేనని, నేను మనసుపడ్డ వ్యక్తి ఇతడే అని హింట్స్ ఇచ్చేస్తోంది. దానికి తగ్గట్టే బోయ్‌ఫ్రెండ్ ఆనంద్ అహుజాతో తరచూ కనిపిస్తోంది. ఇంటాబయటా ఎక్కడ పార్టీకెళ్లినా ఇద్దరూ జతగా దర్శనమిస్తున్నారు. దీంతో సోనమ్ సైలంట్‌గానే తన పర్సనల్ లైఫ్‌ను పబ్లిసైజ్ చేసుకుంటోందని అంతా అనుకుంటున్నారు.
అనిల్ కపూర్ తనయ మనసుపడ్డ ఆనంద్ అహుజా ఢిల్లీలో ప్రముఖ వ్యాపారవేత్తల్లో ఒకరు. ఆనంద్‌తో తరచూ కనిపిస్తున్నా సోనమ్ మాత్రం ప్రేమ విషయంపై మాత్రం ఎలాంటి డైరెక్ట్ కామెంట్ చేయడంలేదు. కానీ ప్రతీ వేడుకలో అతడితో క్లోజ్‌గా మూవ్ అవుతోందని టాక్. మొన్న, సోదరుడు హర్షవర్ధన్ 'మీర్జ్యా' సినిమా ప్రీమియర్ షో కోసం లండన్ వెళ్లిన సోనమ్ అక్కడున్న ఆనంద్ అపార్ట్‌మెంట్‌లోనే ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. ఇక వీరు ట్విట్టర్‌లోనూ ఓసారి రొమాంటిక్‌గా చాట్ చేసుకుని దొరికిపోయారు. "వీటన్నింటినీ చూసైనే మీరే అర్ధం చేసుకోవాలి. నేనే నోరు విప్పి చెప్పాలా?" అన్నట్టుగా.. ఆనంద్‌తో రిలేషన్‌పై సోనమ్ సైలన్స్ పాటిస్తోంది. ఊరకే అన్నారా.. మౌనం అర్ధ అంగీకారమని. ఇంతకీ ఆనంద్ ఎలా ఉంటాడని అనుకుంటున్నారా? పై ఫొటోలో సోనమ్ వెనక పింక్ షర్ట్‌లో ఉన్న వ్యక్తే
No comments:
Post a Comment