Nestham Movie Creations

Saturday, 12 November 2016

నయన్ బాయ్ ఫ్రెండ్.. ఆమెను కాదని


నయన్ బాయ్ ఫ్రెండ్.. ఆమెను కాదనినయన్ బాయ్ ఫ్రెండ్.. ఆమెను కాదని రెండు మూడేళ్లుగా కోలీవుడ్లో నయనతారకు ఎదురే లేదు. రెండేళ్ల వ్యవధిలో నాలుగు హిట్లు కొట్టేసి సౌత్ ఇండియా మొత్తంలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది నయన్. తమిళంలో ఆమెకసలు పోటీనే లేకుండా పోయింది. మిగతా హీరోయిన్లు ఆమెకు అసలు పోటీ ఇచ్చే పరిస్థితుల్లోనే లేరు. ఐతే ఇప్పుడు సీన్ మారుతోంది. నయన్ లాగే మలయాళ గడ్డ నుంచి వచ్చిన కీర్తి సురేష్ ప్రస్తుతం మామూలు జోరుమీద లేదు. ఈ ఏడాది ఆరంభంలోనే ‘రజినీ మురుగన్’ రూపంలో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న కీర్తికి.. తాజాగా ‘రెమో’ రూపంలో మరో హిట్ వచ్చింది. డివైడ్ టాక్ తో మొదలైన ఈ సినిమా కూడా చివరికి హిట్ అనిపించుకోవడంతో కీర్తికి లక్కీ గర్ల్ అన్న ట్యాగ్ వచ్చేసింది. ఆల్రెడీ విజయ్ లాంటి సూపర్ స్టార్ తో కలిసి ‘భైరవ’ అనే సినిమాలో చేస్తున్న కీర్తికి.. ప్రస్తుతం మరిన్ని పెద్ద అవకాశాలు అందుతున్నాయి. తాజాగా సూర్య కొత్త సినిమాకు కూడా ఆమే కథానాయికగా ఎంపికైంది. ఈ చిత్రానికి నయన తార లేటెస్ట్ బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ దర్శకుడు. ముందు దీనికి నయనతారనే హీరోయిన్ అనుకున్నారు. విఘ్నేష్ కూడా ఆమె పట్లే ఆసక్తి చూపించాడు. కానీ తర్వాత ఏం జరిగిందో ఏమో.. సడెన్ గా కీర్తి లైన్లోకి వచ్చింది. కీర్తి ఫామ్ చూసి.. సూర్య-విఘ్నేష్ ఇద్దరూ ఆమెకే ఓటేశారు. విఘ్నేష్ స్వయంగా నయనతారను కాదని కీర్తిని ఓకే చేశాడంటే ఆమె హవా ఏ సథాయిలో నడుస్తోందో అర్థం చేసుకోవచ్చు. త్వరలోనే కీర్తి.. నయనను పక్కకు నెట్టేసి కోలీవుడ్ క్వీన్ గా అవతరించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి

No comments:

Post a Comment

About

Flickr