
హెబ్బా పటేల్.. బాయ్ ఫ్రెండ్స్తో వచ్చేసింది
'కుమారి 21 ఎఫ్" సినిమాతో అందరి దృష్టినీ తన వైపు తిప్పుకుంది హెబ్బా పటేల్. హెబ్బా బోల్డ్ క్యారెక్టర్.. ఆమె అందాలు ఆ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించింది 'కుమారి 21 ఎఫ్". దీంతో ఆమెను లీడ్ రోల్లో పెట్టి నేను నా బాయ్ ఫ్రెండ్స్ అనే కొత్త సినిమా మొదలుపెట్టాడు నిర్మాత బెక్కెం వేణుగోపాల్.స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దగ్గర శిష్యరికం చేసిన భాస్కర్ బండి ఈ సినిమాతోదర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ రోజే ఈ సినిమా మోషన్ పోస్టర్ రిలీజైంది. దీన్ని ఆసక్తికరంగానే తీర్చిదిద్దారు.
ఈ చిత్రానికి ముందు అనుకున్న టైటిల్లో చిన్న మార్పు చేసి మోషన్ పోస్టర్ వదిలారు. 'నేను నా బాయ్ ఫ్రెండ్స్" అనే పేరు ముందు 'నాన్న" అనే పదం కూడా చేర్చారు. ఆ నాన్న పాత్రను రావు రమేష్ చేస్తున్నాడు. బాయ్ ఫ్రెండ్స్ పాత్రల్లో 'కేరింత" ఫేమ్ పార్వతీశం, 'రాజుగారి గది" హీరో అశ్విన్, 'కుమారి 21 ఎఫ్"లో నెగెటివ్ రోల్ చేసిన నోయెల్ కనిపించబోతున్నారు. ఈ సినిమాలో హెబ్బా గ్లామర్ విందు చేయబోతోందని సమాచారం. ఈ చిత్రాన్ని దిల్ రాజు తన బేనర్ ద్వారా రిలీజ్ చేస్తుండటం విశేషం. ఆయనకు స్క్రిప్టు నచ్చి సినిమా పూర్తి కాకముందే నిర్మాణ భాగస్వామిగా మారాడు. నవంబర్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది
No comments:
Post a Comment