Nestham Movie Creations

Friday, 11 November 2016

ప్రేమమ్‌ భామ పెళ్లే చేసుకోదట


ప్రేమమ్‌ భామ పెళ్లే చేసుకోదటపెళ్లి చేసుకోను అనే హీరోయిన్ల లిస్ట్ లో మరొకరు చేరారు. ఓవైపు పెళ్లి చేసుకున్న వారు విడిపోతూ కలకలం సృష్టిస్తుంటే మరో పక్క అసలు పెళ్లే వద్దు అని సంచలన కలిగిస్తున్న వారి సంఖ్య పెరుగుతోందనిపిస్తోంది. ఇంతకు ముందు నటి శ్రుతిహాసన్ పెళ్లి చేసుకోకుండానే పిల్లల్ని కంటాను అని ప్రకటించి అందర్నీ అవాక్కయ్యేలా చేసింది. ఇప్పుడు అప్ కమింగ్ యాక్ట్రెస్ సాయిపల్లవి తాను పెళ్లే చేసుకోనని చెబుతోంది. మలయాళం చిత్రం ప్రేమమ్‌తో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన ఈ కేరళా కుట్టి అంతకు ముందు కంగనారనౌత్ నటించిన హిందీ చిత్రం ధామ్ ధూమ్‌లో చిన్న పాత్రలో మెరిసింది. మెడిసిన్ చదివిన సాయిపల్లవి మంచి డాన్సర్ కూడా. కొన్ని ఛానెళ్ల డాన్స్ పోటీల్లోనూ పాల్గొన్న సాయి పల్లవి.. ప్రేమమ్ మూవీతో సౌతిండియా యూత్ హార్ట్ థ్రోబ్ గా మారిపోయింది. గతంలో మణిరత్నం దర్శకత్వంలో నటించే లక్కీచాన్‌‌స వచ్చినట్లే వచ్చి మిస్ అయింది. ప్రస్తుతం తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్‌కు జంటగా ఫిదా అనే చిత్రంలో నటిస్తున్నారు

No comments:

Post a Comment

About

Flickr