Nestham Movie Creations

Friday, 11 November 2016

నేను, సల్మాన్‌ ప్రేమించుకున్నాం


నేను, సల్మాన్‌ ప్రేమించుకున్నాంబాలీవుడ్ లో ఖాన్ త్రయం (షారుక్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, ఆమిర్‌ ఖాన్‌) మధ్య బద్ధ శత్రుత్వం ఉందని చాలాకాలంగా వార్తలొస్తూనే ఉన్నాయి. చిత్రసీమలో ఎవరు గ్రేట్ అనే విషయమై వీరి మధ్య వివాదాలు వచ్చి పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొందని అంటారు. ఆమిర్ ఖాన్ అయితే ఏకంగా తన కుక్కపిల్లకు షారుక్ అని పేరు పెట్టాడన్న వార్త కొంత కాలం క్రితం చక్కర్లు కొట్టింది. ఈ వార్తల సంగతి పక్కన పెడితే, అప్పట్లో ఉన్నన్ని విబేధాలు ప్రస్తుతం వీరి మధ్య లేవని తాజా పరిణామాలు రుజువుచేస్తున్నాయి. ఇటీవలిగా పలు సందర్భాల్లో షారుక్, సల్మాన్ కలిసి కనిపించారు. ఇక దీపావళి పండగకు షారుక్ ను ఇంటికి ఆహ్వానించి మరీ ఎంజాయ్ చేశాడు ఆమీర్. దీంతో ఖాన్ ల మధ్య మైత్రి బలపడుతోందని బీటౌన్ జనాలు చెప్పుకుంటున్నారు. ఈ మాటలను నిజం చేస్తూ షారుక్ తాజాగా సల్మాన్ గురించి ఓ సరదా వ్యాఖ్య చేశాడు. "నేను సల్మాన్‌ కలిసి ఉన్నప్పుడు చూసినవారెవరైనా ఇద్దరికీ సంబంధం ఉందనుకుంటారు. మేము రొమాంటిక్ రిలేషన్‌షిప్‌లో ఉన్నామని అనుకుంటారు. నాకు కావాల్సిందీ అదే. నేను సల్మాన్‌ ప్రేమించుకుంటున్నాం అనేదే మా ఇద్దరి మధ్య ఆఖరి పుకారు కావాలి. ఎందుకంటే మా గురించి అన్నీ చెప్పేశారు, వినేశారు. ఇక మిగిలింది ఈ ఒక్కమాటే" అని అన్నాడు కింగ్‌ఖాన్‌. సల్మాన్, ఆమీర్ లతో అనుబంధం గురించిన మరిన్ని ఆసక్తికర విషయాలువెల్లడించాడు షారుక్. ‘నేను, సల్మాన్‌, ఆమిర్‌లు ఎప్పుడూ సినిమా స్టార్‌డం గురించి మాట్లాడుకోం. చెప్పాలంటే ముగ్గురూ కలిసి నటిస్తే ఎలా ఉంటుంది అన్నదానిపైనే చర్చించుకుంటాం. ఓసారి నేను నా కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌తో సల్మాన్‌ని కలవాలని వెళ్లాను. సల్మాన్‌ నన్ను చూసి ‘మనం చాలా లక్కీ అని అన్నాడు. దేవుడు మనకు చాలా ఇచ్చాడు. ఈ వయసులో మరొకరైతే రిటైర్‌మెంట్‌ గురించి ఆలోచించేవారు. కానీ మనం చాలా అదృష్టవంతులం. పద ఓ డ్రింక్ లాగించేద్దాం’ అని సల్లూభాయ్ అన్నట్లు చెప్పుకొచ్చాడు 'డియర్ జిందగీ' స్టార్. సల్మాన్‌ అలా ఎందుకు అన్నాడో తెలీదుకానీ అతని మాటలు వింటుంటే ఇద్దరికీ ఒకే రకమైన ఆలోచనలున్నాయనిపించిందట షారుక్ కు. అందుకే తామిద్దరం ప్రేమలో పడ్డామన్న పుకారు వస్తే బాగుంటుందనిపిస్తోందని తెలిపాడు బాలీవుడ్ బాద్షా

No comments:

Post a Comment

About

Flickr