జిల్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పెద్ద షాకే ఇచ్చాడు కబీర్ సింగ్ దుల్హన్. తెలుగులో ఇలా తొలి సినిమాతో ఓ విలన్ బలమైన ముద్ర వేసి చాలా కాలమైంది. ‘జిల్’ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకున్నా.. కబీర్ మీద మాత్రం ఆఫర్ల వర్షం కురిసింది. గత రెండేళ్లలో దాదాపు పాతిక సినిమాలు చేశాడతను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు సైతం విలన్‌గా నటించాడు కబీర్. ఆ సినిమానే ‘సర్దార్ గబ్బర్ సింగ్’. ఐతే అందులో అతడి పాత్ర తేలిపోయింది. మరీ డమ్మీలా అయిపోయాడు కబీర్. విలన్‌గా ఒకప్పటి ఊపు లేదు కానీ.. సినిమాలకైతే ఢోకా లేదు. కబీర్ ప్రస్తుతం హీరోగా మారుతుండటం విశేషం. కబీర్ హీరోగా పరిచయమవుతున్న సినిమా తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో తెరకెక్కబోతుండటం విశేషం. అశ్విన్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తాడట. ఇదొక హార్రర్ సినిమా అని.. హీరోయిన్ పాత్రకు కూడా చాలా ప్రాధాన్యం ఉంటుందని కబీర్ అంటున్నాడు. కబీర్ సినిమాల్లోకి రావడానికి ముందు మోడల్. అప్పటి అతడి ఫొటోలు చూస్తే హీరో ఫీచర్లు బాగానే ఉన్నాయనిపిస్తుంది. ఐతే క్రూరమైన విలన్ పాత్రల్లో అతణ్ని చూసి అలాంటి క్యారెక్టర్లకే అలవాటు పడిపోయాం. ప్రస్తుతం కబీర్‌కు తెలుగులో అవకాశాలు తక్కువే కానీ.. తమిళం, కన్నడలో మంచి ఛాన్సులే అందుకుంటున్నాడు. కన్నడలో సుదీప్ హీరోగా నటిస్తున్న ‘హెబ్బులి’లో అతను విలన్ పాత్ర చేస్తున్నాడు

No comments:
Post a Comment