ముందుగా అనుకున్నట్టు వక్కంతం వంశీతో సినిమా మొదలు పెట్టేసి ఉన్నట్టయితే ఈపాటికి ఎన్టీఆర్ తదుపరి చిత్రం సగం పూర్తయిపోయి వుండేది. కానీ ఈ టైమ్‌లో కొత్త దర్శకుడితో ఎందుకొచ్చిన రిస్కు అని చెప్పి అనుభవమున్న దర్శకుల కోసం వెతుకుతున్నాడు ఎన్టీఆర్. వక్కంతం వంశీకి దర్శకుడిగా అవకాశమిస్తానంటూ ఎన్టీఆర్ అయిదేళ్ల క్రితమే మాట ఇచ్చాడు. దాంతో అతనికి వేరే అవకాశాలు వచ్చినా కానీ అవన్నీ వదులుకుని ఎన్టీఆర్ కోసమే కూర్చున్నాడు. తను డైరెక్ట్ చేసుకుందామని రాసుకున్న 'టెంపర్' కథ కూడా ఎన్టీఆర్ అడిగాడని ఇచ్చేసాడు. తప్పకుండా ఛాన్స్ ఇస్తాడని నమ్మకం పెట్టుకున్న తారక్ చెయ్యి ఇవ్వడంతో వేరే హీరోల కోసం వేటాడుతున్నాడు వక్కంతం వంశీ. మాట నిలబెట్టుకోకపోవడం వల్ల ఎన్టీఆర్‌పై ఇండస్ట్రీ సర్కిల్స్‌లో చాలా కామెంట్స్ పడుతున్నాయి. ఒక స్టార్ హీరో ఒకసారి మాట ఇస్తే వెనక్కి తగ్గకూడదని, ఇండస్ట్రీలో ఎన్టీఆర్, కృష్ణ కాలం నుంచి చిరంజీవి, పవన్‌ల కాలం వరకు ఇదే జరిగిందీ, జరుగుతోందనీ, దీనిని ఎన్టీఆర్ గుర్తుంచుకోవాలని అంటున్నారు. మాట ఇచ్చిన కారణంగా అసలు ఫామ్‌లో లేని దర్శకులతో పవన్‌కళ్యాణ్ పని చేసిన సందర్భాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. తనని అన్ని సంవత్సరాలు వెయిట్ చేయించి, సినిమా చేయనని మొండికేసిన ఎన్టీఆర్ గురించి వక్కంతం వంశీ అస్సలు కామెంట్ చేయడం లేదు. అయినప్పటికీ వంశీ పట్ల సింపతీ వేవ్ అయితే ఇండస్ట్రీలో బలంగానే వీస్తోంది.

No comments:
Post a Comment