
ప్రేమమ్‌లో శృతిహాసన్ క్యారెక్టర్ పెద్దగా గుర్తుండి ఉండకపోవచ్చు కానీ మలయాళంలో అదే పాత్ర చేసిన సాయి పల్లవికి మాత్రం మల్లూ జనాలు గుండెల్లోనే గుళ్లు కట్టేసారు. త్వరలో శేఖర్ కమ్ముల సినిమాతో ఫిదా చేయడానికి వస్తోన్న సాయి పల్లవి గురించి ఈమధ్య కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి. ఇటీవల ఏదో సినిమాలో ఎక్స్‌పోజింగ్ చేయమని అడిగితే నో చెప్పిందని, దాంతో ఆమెని తీసేసారని గుసగుసలాడుకున్నారు. ఈ పుకార్లని ఆమె కొట్టి పారేసింది. తనని ఎవరూ అలా కోరలేదని, ఇవి ఎవరో కల్పించిన వదంతులే తప్ప నిజం లేదని ఆమె చెప్పింది. అయినా ప్రేమమ్ చూసిన సాయి పల్లవితో ఎక్స్‌పోజింగ్ చేయించాలని ఎవరు మాత్రం ప్రయత్నిస్తారు?
ఆ సినిమాతో ఆమె పట్ల అందరికీ ఒక గౌరవ భావం ఏర్పడిపోయింది. నిజంగా సాయి పల్లవికే ఇమేజ్ మార్చుకుందామనే కోరిక వున్నా కానీ జనం తిప్పి కొట్టేస్తారనడంలో సందేహం లేదు. సినిమాల గురించి, పబ్లిక్ ఇమేజ్ గురించి ఏమాత్రం అవగాహన ఉన్న వాళ్లయినా ఇలాంటి సాహసానికి ఒడికట్టరు. సౌందర్య, నిత్య మీనన్ తరహాలో ఎప్పటికీ క్లీన్ ఇమేజ్‌తోనే రిటైర్ అయిపోవాల్సిందే తప్ప సాయి పల్లవిని హాట్‌గా చూసే అవకాశం అయితే లేదు. ఆమె కొట్టి పారేయడం కాదు కానీ నిజంగానే ఈ వార్తలు నమ్మశక్యంగా లేవు. ఇంతకీ సాయి పల్లవి నేచురల్ గ్లామర్‌కి మన వాళ్లు మలయాళ ప్రేక్షకుల మాదిరిగా ఫిదా అవుతారా లేదా అనేది చూడాలి. అదే జరిగితే ఆమె టాలీవుడ్‌లోను బిజీ అయిపోవడం ఖాయం.
No comments:
Post a Comment