
బాలీవుడ్ అందాలతార ఐశ్వర్యా రాయ్, అభిషేక్ బచ్చన్ ల ముద్దుల తనయ ఆరాధ్య.. షూటింగ్ సెట్ లో పొరపాటు పడిందట. మరో హీరో రణవీర్ కపూర్ ను తన తండ్రి అభిషేక్ గా భావించిన ఆరాధ్య అతని దగ్గరకు వెళ్లి కౌగిలించుకుంది. ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య ఈ విషయాన్ని చెప్పింది.
ఐశ్వర్య, రణవీర్ జంటగా ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కు ఐశ్వర్య తన కూతురును తీసుకెళ్లింది. సెట్ లో కూర్చున్న రణవీర్ ను చూసిన ఆరాధ్య తన తండ్రి అనుకుని అతని దగ్గరకు వెళ్లింది. అభిషేక్ తరచూ క్యాప్ పెట్టుకుని జాకెట్ వేసుకుంటాడు. ఆ రోజు రణవీర్ కూడా అచ్చం అభిషేక్ మాదిరిగా క్యాప్ పెట్టుకుని, జాకెట్ ధరించాడు.
దీంతో ఆరాధ్య పొరపాటు పడిందని, రణవీర్ ను అభిషేక్ లా భావించిందని ఐశ్వర్య చెప్పింది. ఆరాధ్యకు రణవీర్ అంటే ఇష్టమని, అతనితో ఎక్కువసేపు గడిపేదని తెలిపింది.
కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన ఏ దిల్ హై ముష్కిల్ కష్టాల్లో పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పాకిస్థాన్ నటుడు నటించినందున విడుదల చేయబోమని థియేటర్ల యజమానులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో నాలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదలపై అనిశ్చిత ఏర్పడింది. కరణ్ జోహార్ ఇటీవల కేంద్ర హోం మంత్రి రాజనాథ్ సింగ్ ను కలసి సాయం కోరాడు. అంతకుముందు ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చాడు. ఈ సినిమాలో రణవీర్, ఐశ్వర్య హాట్ హాట్ సన్నివేశాల్లో నటించారు. విడుదల చేసిన ఈ సినిమా స్టిల్స్ లో ఐష్ హాట్ గా కనిపించింది.
No comments:
Post a Comment