Nestham Movie Creations

Wednesday, 9 November 2016

స్టూడియో యజమాని రేప్ చేశాడు


లాస్ ఏంజెలిస్: హాలీవుడ్ నటి రోజ్ మెక్ గొవన్ సంచలన ఆరోపణలు చేసింది. ఓ స్టూడియో యజమాని తనపై లైంగికదాడి చేశాడని ఆరోపించింది. కాగా ఆయన పేరును ఆమె వెల్లడించలేదు. అయితే తనపై దాడి జరిగిన విషయం హాలీవుడ్ లో బహిరంగ రహస్యమని చెప్పింది. నిందితుడిపై న్యాయపోరాటం చేసేందుకు ప్రయత్నించానని, ఓ న్యాయవాదితో సలహా అడిగానని రోజ్ వెల్లడించింది. అయితే ఓ సినిమాలో తాను శృంగార సన్నివేశంలో నటించినందున, కోర్టులో ఈ క్రిమినల్ కేసును ఎప్పుడూ గెలవలేవని న్యాయవాది తనకు సలహా ఇచ్చారని చెప్పింది. ఈ విషయాలన్నింటినీ ఆమె ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. లేడీ గాగా.. రోజ్ కు మద్దతు తెలిపింది. తాను టీనేజ్ లో ఉన్నప్పుడు ఓ మ్యూజిక్ డైరెక్టర్ తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని గాగా గతంలో ఆరోపించింది.

No comments:

Post a Comment

About

Flickr