
బాహుబలిని ఎందుకు చంపాడు ఈ ప్రశ్నకు సమాధనం బాహుబలి 2విడుదల అయితే తెలిసిపోతుంది. కానీ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కి పెళ్లి ఎప్పుడు ? ఈ ప్రశ్నకు మాత్రం ఎప్పుడూ సమాధనం దొరకదేమో. ఇప్పటికే చాలా మందిని ప్రేమించి బ్రేక్ అఫ్ లు చెక్కుకున్న సల్మాన్ ఖాన్ పెళ్లి ఊసు మాత్రం ఎత్తడం లేదు.
ప్రస్తుతం సల్మాన్ రొమేనియాకి చెందిన మోడల్ యులియా వంతూర్‌తో ప్రేమాయణం సాగిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికీ ఎంగేజ్‌మెంట్ అయినట్లు కూడా వార్తలొచ్చాయి. దీంతో సల్మాన్ పెళ్లి కొడుకు కాబోతున్నాడని ఆయన అభిమానులు ముచ్చట పడిపోయారు. అయితే లేటెస్ట్ బజ్ ఏమిటంటే.. ఈమెను కూడా వదిలేశాడట సల్మాన్.
ప్రస్తుతం వీరిద్దరి మధ్య మాటల్లేవట. దీనికి కారణం యులియా వంతూర్ ప్రవర్తనేనట. యులియాకి ఇంతకుముందే వివాహం అయ్యింది. ఆమె భర్తతో విడాకులు కూడా తీసుకుంది. అయితే ఇప్పుడు సల్మాన్‌తో ప్రేమలో ఉన్నా కూడా యులియా తన మాజీ భర్తతో ఇంకా టచ్‌లో ఉంటోందటయులియా. ఈ విషయంలో చాలా సార్లు సల్మాన్ మందలించాడట. కానీ ఆమె మాత్రం లైట్ తీసుకుంది. ఇక ఇలాంటి రిలేషన్‌షిప్ అనవసరమని భావించిన సల్మాన్ బ్రేక్ చెప్పేశాడట బాలీవుడ్ గుసగుస.
No comments:
Post a Comment